Rajya Sabha: క్షమాపణ చెబితే అవమానించారు: ఎంపీ ఆవేదన

Parliament Session in Rajya Sabha | ఓ వైపు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కరోనా పడ్డారు. మరోవైపు సభలో ప్రవేశపెడుతున్న వ్యవసాయ సంబంధిత బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది.

Last Updated : Sep 22, 2020, 12:11 PM IST
Rajya Sabha: క్షమాపణ చెబితే అవమానించారు: ఎంపీ ఆవేదన

ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి. అయితే ఓ వైపు కేంద్ర మంత్రులతో పాటు 30 మంది ఎంపీలు కరోనా పడ్డారు. మరోవైపు సభలో ప్రవేశపెడుతున్న వ్యవసాయ సంబంధిత బిల్లులతో పాటు ఇతర బిల్లులపై చర్చ గందరగోళ పరిస్థితులకు దారితీస్తోంది. కొందరు ఎంపీలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ వెల్ లోకి దూసుకెళ్లడం, నిరసనలు తెలపడం చేశారు. ఈ నేపథ్యంలో 8 మంది రాజ్యసభ సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేయగా వారు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేస్తున్నారు.

ఈ అంశంపై సీనియర్ నేత, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ (Ram Gopal Yadav) స్పందించారు. ‘నేను సీనియర్ ఎంపీని. సభలో జరిగిన దానిపై నేను ఇదివరకే క్షమాపణ కోరాను. కానీ అందుకు ప్రతిస్పందన రాలేదు. ఇది నాకు అవమానకరంగా అనిపిస్తోంది. దీంతో సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని మా పార్టీ నిర్ణయం తీసుకుందుని’ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నేటి ఉదయం పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు.

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News