Parliament Session: సుదీర్ఘ విరామం అనంతరం..సెప్టెంబర్ 14 నుంచి సమావేశాలు

కోవిడ్ 19 నిబంధనల ( Covid19 regulations ) మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament rainy sessions ) ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి  అక్టోబర్ 1 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్టు అదికారులు వెల్లడించారు.

Last Updated : Aug 25, 2020, 10:42 PM IST
Parliament Session: సుదీర్ఘ విరామం అనంతరం..సెప్టెంబర్ 14 నుంచి సమావేశాలు

కోవిడ్ 19 నిబంధనల ( Covid19 regulations ) మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( Parliament rainy sessions ) ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి  అక్టోబర్ 1 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్టు అదికారులు వెల్లడించారు.

మార్చ్ నెలలో బడ్జెట్ సమావేశాల ( Budget meeting ) అనంతరం అర్ధంతరంగా వాయిదా పడిన పార్లమెంట్ మళ్లీ సెప్టెంబర్ లో కొలవుదీరనుంది. పూర్తి కోవిడ్ 19 నిబంధనలు, ఆంక్షల మధ్య వర్షాకాల సమావేశాలు ప్రారంభించడానికి నిర్ణయించారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకూ ( parliment from september 14 to october 1 ) 18 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్ ( Corona virus ) నేపధ్యంలో భౌతికదూరం పాటిస్తూ ఇరు సభల్లో సభ్యుల స్థానాన్ని కేటాయించనున్నారు. రాజ్యసభ సభ్యులు లోక్ సభ, రాజ్యసభల్లో కూర్చోనుండగా...లోక్ సభ సభ్యులు మాత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూర్చుంటారు.

ప్రతి ఎంపీ విధిగా ఆరోగ్య సేతు యాప్ ( Arogya setu app ) డౌన్ లోడ్ చేసుకోవాలనే నిబంధన ఉంటుంది. సభ్యులకు స్క్రీనింగ్ తోపాటు శానిటైజేషన్ వ్యవస్థ ప్రతిచోటా ఉంటుందని అధికారులు తెలిపారు. సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్ లో అనుమతి ఉండదు ఈసారి. మార్చ్ నెలలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా 12 బిల్లులు ఆమోదం పొందాయి. ఆ తరువాత రెండు సభలూ అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. Also read: Corona Study: కరోనా వైరస్ రాకూడదంటే..కిటికీలు తెర్చుకోవల్సిందే

Trending News