జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్ మధ్య అమిత్ షా 3 రోజుల పర్యటన

జమ్ముకశ్మీర్‌లో 3 రోజులపాటు పర్యటించనున్న అమిత్ షా

Last Updated : Aug 4, 2019, 05:18 PM IST
జమ్ముకశ్మీర్‌లో హైటెన్షన్ మధ్య అమిత్ షా 3 రోజుల పర్యటన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం జమ్ముకశ్మీర్‌కి వెళ్లనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడే మూడురోజులపాటు పర్యటించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో అనిశ్చిత పరిస్థితులు, అభద్రతా భావంతో కూడిన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన అక్కడే ఉండి భద్రతను సమీక్షించనున్నారు. అంతేకాకుండా జీ న్యూస్‌కి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇదే పర్యటనలో భాగంగా అక్కడి బీజేపి నేతలతో సమావేశం కానున్న అమిత్ షా.. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నారని తెలుస్తోంది. 

అమర్‌నాథ్ యాత్రకు వచ్చిన భక్తులతోపాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన పర్యాటకులు సైతం వీలైనంత త్వరగా జమ్మూకాశ్మీర్‌ విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Trending News