7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి : కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్

7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ : కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్

Last Updated : Jul 4, 2019, 12:46 PM IST
7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి : కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 7 లక్షల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ తెలిపారు. 2018 మార్చి వరకు ఒక్క రైల్వే శాఖలోనే 2.6 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి స్పష్టంచేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్, బీజేపీ ఎంపీ దర్శన్ జర్ధష్‌లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. వివిధ శాఖల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయడం లేదని ఎంపీలు చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి ఖండించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతోందని, ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు చర్యలు తీసుకోవాల్సి ఉందని మంత్రి సమాధానం ఇచ్చారు. 

రైల్వే శాఖలో 2.59 లక్షల పోస్టులు, రక్షణ మంత్రిత్వ శాఖలో 1.87 లక్షల సివిల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన మంత్రి.. హోంశాఖ, పారామిలటరీ దళాలు, ఢిల్లీ పోలీసు శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయని అన్నారు.

Trending News