Omicron strain: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు- కఠిన ఆంక్షల దిశగా ఇజ్రాయెల్​!

Omicron strain: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం కరోనా వేరియంట్​ భయాలతో ఇజ్రాయెల్​ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 04:25 PM IST
  • ఒమిక్రాన్ భయంతో ఇజ్రాయల్​ కఠిన నిర్ణయాలు!
  • విదేశీ ప్రయాణికులపై తాత్కాలిక నిషేదం!
  • త్వరలో అధికారిక ప్రకటనకు అవకాశం
Omicron strain: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు- కఠిన ఆంక్షల దిశగా ఇజ్రాయెల్​!

Israel is to ban foreigners from entering the country: కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు.. కొత్త వేరియంట్లు (Corona new Variant) ఆందోళనకరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్​ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దక్షిణాప్రికా సహా, దాని సమీప దేశాలకు వెళ్లకుండా తమ దేశ పౌరులపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీనితో పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను (Omicron Variant) తమ దేశంలోకి అనుమతించడం లేదు.

ఇదే కారణంతో ఇజ్రాయెల్ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 14 రోజులపాటు అంతర్జాతీయ ప్రయాణికులను బ్యాన్ (Israel to Travel Ban) చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయని సమాచారం.

శనివారం రాత్రి అత్యవసరంగా సమావేశమైన ఇజ్రాయెల్​ కేబినెట్ ఈ మేరకు నిర్ణయం (Israe Govt on Travel Ban) తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ త్వరలోనే అధికారికరిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా కొత్త వేరియంట్ ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. అయితే ప్రపంచదేశాలు (WHO on Corona new Variant) తొందర పడి ఆంక్షలు విధించొద్దని సూచించింది. శాస్త్రియమైన పరిష్కారాలనే కనుగొనాలని తెలిపింది.

ఇజ్రాయెల్ కఠిన నిబంధనలు(Israel Travel rules)..

ఇతర దేశాల పౌరులకు ప్రవేశం పూర్తిగా నిషేధించడం సహా.. స్వదేశానికి తిరిగివచ్చే ఇజ్రాయెల్ దేశ ప్రజలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది.

టీకాలు తీసుకుని స్వదేశానికి వచ్చిన ఇజ్రాయెల్ పౌరులకు మూడు రోజులు, టీకా తీసుకోని వారికి 7 రోజులు క్వారంటైన్​ తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.

కరోనా రోగులపై నిఘా ఉంచేందుకు సెక్యూరిటీ ఏజెన్సీలకు అనుమతులు ఇచ్చింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించి కొవిడ్ పేషంట్ల కదలికలను గమనిస్తుంటాయి ఈ ఏజన్సీలు.

ఇప్పటికే 50 ఆఫ్రికన్ దేశాలను రెడ్ లిస్ట్​లో చేర్చింది ఇజ్రాయెల్​. ఆయా దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన పౌరులను క్వారంటైన్​ కేంద్రాలకు తరలిస్తోంది. 

Also read: Omicron In Australia: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్.. ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్

Also read: Newzealand MP: డెలివరీ కోసం స్వయంగా సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లిన మహిళా ఎంపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News