ఇండియాలో ఒమిక్రాన్ ప్రకంపనలు, అప్రమత్తమైన వివిధ రాష్ట్రాలు

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ ప్రకంపనలు రేపుతోంది. దక్షణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో ప్రవేశించిందా..మరో వేవ్‌కు దారి తీయనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2021, 03:02 PM IST
  • ఇండియాలో కలకలం రేపుతున్న ఒమిక్రాన్ వేరియంట్
  • ఒమిక్రాన్ వేరియంట్ నేపధ్యంలో అప్రమత్తమైన వివిధ రాష్ట్రాలు
  • ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటున్న రాష్ట్రాలు
 ఇండియాలో ఒమిక్రాన్ ప్రకంపనలు, అప్రమత్తమైన వివిధ రాష్ట్రాలు

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ ప్రకంపనలు రేపుతోంది. దక్షణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఇండియాలో ప్రవేశించిందా..మరో వేవ్‌కు దారి తీయనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

కరోనా మహమ్మారి(Corona Pandemic) మరో రూపం దాల్చింది. డెల్టా వేరియంట్ రూపంతో సెకండ్ వేవ్‌తో విధ్వంసం సృష్టించిన కరోనా వైరస్  ఇప్పుడు ఒమిక్రాన్(Omicron Variant)రూపంతో భయం రేపుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమైందనే హెచ్చరికలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికా( South Africa) నుంచి బెంగళూరు చేరిన ఇద్దరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన అధికమైంది. అయితే ఆ ఇద్దరికీ సోకింది డెల్టా వేరియంట్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారంతా. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో ప్రవేశించి..మరో వేవ్‌కు దారి తీయనుందనే ఆందోళన అధికమవుతోంది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో అప్రమత్తత జారీ చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు(Covid Restrictions) పాటించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఆసుపత్రుల్ని సిద్ధం చేయాలని కోరారు. ఒమిక్రాన్ సంక్రమించకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని..ఒమిక్రాన్ వెలుగుచూసిన దేశాల్నించి ఇండియాకు విమానాల రాకపోకలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక మహారాష్ట్రకు (Maharashtra)వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని లేదా 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకు చేరేవారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విదేశీ ప్రయాణీకుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా కొత్త ఆంక్షలు విధించింది. యూరప్, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, హాంకాంగ్ దేశాల్నించి వచ్చేవారు వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో చేయించుకోవల్సి ఉంటుంది. లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. 

అటు కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు(Kerala Government) కూడా అప్రమత్తమయ్యాయి. ఆర్టీపీసీఆర్ (RTPCR Test)నెగెటివ్ ధృవపత్రం చూపిస్తేనే రాష్ట్రంలోకి ఎంట్రీ అంటోంది కర్ణాటక. 16 రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన విద్యార్ధులు మరోసారి పరీక్షలు చేయించుకోవాలని కోరింది. కేరళ ప్రభుత్వం విమానాశ్రయాల్లో నిఘాను పెంచింది. వైరస్ వ్యాప్తి కట్టడికై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 

Also read: Gautam Gambhir: గౌతమ్​ గంభీర్​కు మరోసారి బెదిరింపు మెయిల్- వారంలో ఇది మూడోసారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News