Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు.
KCR Focus on Munugode Elections: మునుగోడులో విజయం సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, అందుకే ఆయన అన్ని రకాలుగా మునుగోడు మీద ఫోకస్ చేస్తున్నారు. ఆ వివరాలు కింది వీడియోలో చూద్దాం.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.
Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉన్న బూర.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
Bandi Sanjay to Visit Delhi : మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. ఆ వివరాలు కింది వీడియోలో చూద్దాం.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా మార్చారంటూ కేసీఆర్ మీద ఈటెల రాజెందర్ ఆరోపణలు చేశారు.
Munugode By Election: Huge number of fraudulent voters registered in Munugode by poll. మునుగోడు ఉప ఎన్నికలో కొత్త వివాదం దుమారం రేపుతోంది. ఈ ఎన్నిక కోసం భారీగా దొంగ ఓటర్లను నమోదు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతోందని అన్నాడు.
The controversy over the new voters in the previous by-election is intensifying. In the last two months, around 25,000 new voters have applied in the constituency
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్దమైన ఘటనతో పాల్వాయి స్రవంతి రోడ్డుపై బైటాయించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.
Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద వింత ప్రచారం ఊపందుకుంది. రాత్రికి రాత్రే ఆయన మీద కాంట్రాక్ట్ పే అంటూ కొన్ని పోస్టర్లు బయటకు వచ్చాయి. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌లను బీజేపీ ఇవ్వడంతోనే ఆ పార్టీలోకి చేరారంటూ పోస్టర్లు కలకలం సృష్టించాయి.
Komatireddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపి తరపున పోటీ చేసేందుకు రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కొత్తగా ప్రకటించిన గట్టుప్పల మండలంలో ఓట్లు టీఆర్ఎస్కే పడేలా స్థానిక బీజేపి నేత ఒకరు రాజగోపాల్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు.
Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.