Munugode Bypoll: మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త..

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Oct 16, 2022, 04:56 PM IST

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారా స్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. పోటాపోటీ ర్యాలీలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు స్పష్టిస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. నీ సంగతి చూస్తానంటూ మైక్ లోనే బెదిరించారు. రాజగోపాల్ రెడ్డి మాటలతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యకర్తపై దాడికి యత్నించారు. పోలీసులు అతన్ని అక్కడి నుంచి తప్పించారు. రాజగోపాల్ రెడ్డి బెదిరించిన వీడియో వైరల్ గా మారింది.

 

Video ThumbnailPlay icon

Trending News