Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 25 వేల కొత్త ఓటర్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 12 వేల ఓట్లకు ఈసీ అనుమతి ఇచ్చింది. 7 వేల దరఖాస్తులను తిరస్కరించింది. మరో 6 వేల ఓట్ల దరఖాస్తులు ఇంకా పెండింగులో ఉన్నాయి.
Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఉప ఎన్నికపై ఆయన హైకోర్టులో పిల్ వేశారు. మునుగోడు ఉప ఎన్నికను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోకపోతే మార్చేస్తామని రేవంత్ ను హెచ్చరించారని తెలుస్తోంది.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా మార్చారంటూ కేసీఆర్ మీద ఈటెల రాజెందర్ ఆరోపణలు చేశారు.
Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్కు మధ్య జరుగుతోందని అన్నాడు.
Munugode Bypoll:మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. వరుస ట్వీట్లు చేసిన కేటీఆర్.. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్దమైన ఘటనతో పాల్వాయి స్రవంతి రోడ్డుపై బైటాయించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.
Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.
Munugode Bypoll Money: వారం రోజుల్లోనే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 10 కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నారు.మునుగోడు బైపోల్ జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున హవాలా నగదు పట్టుబడుతోంది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం ముదురుతోంది. గత రెండు నెలల్లోనే నియోజకవర్గం పరిధిలో దాదాపు 25 వేల కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు.అధికార పార్టీ భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిందని బీజేపీ ఆరోపిస్తోంది
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను విచ్చలవడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడిక్కకడ ప్యాకేజీలు మాట్లాడుతూ గంపగుత్తగా కొనేస్తున్నారు. మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో డబ్బులు ఎవరికి ఊరికే రావు... ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
KTR HOT COMMENTS: మునుగోడు ఉప ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. బీజేపీతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్జిపై విరుచుకుపడ్డారు.
KTR COMMENTS: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. మునుగోడు నియోజకవర్గానికి మూడేళ్లుగా కోమటిరెడ్డి ఏం చేయలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అన్నారు కేటీఆర్. 22 వేల కాంట్రాక్టు కోసమే ఆయన బీజేపీలో చేరారని మండిపడ్డారు.
Komatireddy Rajgopal Reddy: తన మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా అఫిడవిట్ లో చూపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ లో తన మొత్తం ఆస్తిని రూ. 24.5 కోట్లుగా చూపించారు.2018లో ఆయన భార్య అస్తుల విలువ రూ. 289.75 కోట్లు.అంటే 2018తో పోలిస్తే రాజగోపాల్ రెడ్డి ఆస్తి భారీగా పెరగగా.. ఆయన సతీమణి సంపద తరిగిపోయింది.
Munugode Bypoll: చండూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తగలబడటం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీసు లోపల ఉన్న పార్టీ జెండాలు తగలబడ్డాయి.
Munugode Posters: చండూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేసిన రోజే అతనికి వ్యతిరేకంగా చండూరులో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి
Munugode Bypoll: రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగుతుండగానే.. అదే మండల జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. తన అనుచరులతో సమావేశమై అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.కర్నాటి బాటలోనే ఇటీవల బీజేపీలో చేరిన మరికొంత మంది నేతలు తిరిగి అధికార పార్టీలోకి వస్తారనే ప్రచారం సాగుతోంది
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈనెల 15న ఫ్యామిలీతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాతే ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన సోదరుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడం ఇష్టం లేకే కోమటిరెడ్డి జంప్ అయ్యారని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.