Munugode Bypoll: డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పదం. ఓ ప్రముఖ జ్యూవెలరీ షాపు ప్రచారంలో ఇది వినిపిస్తుంది. డబ్బులు ఊరికే రావు అన్న స్లోగన్ ఆ సంస్థకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ నినాదం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మార్మోగుతోంది.ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను విచ్చలవడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడిక్కకడ ప్యాకేజీలు మాట్లాడుతూ గంపగుత్తగా కొనేస్తున్నారు. మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో డబ్బులు ఎవరికి ఊరికే రావు... ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి అన్న పదం మునుగోడు నియోజకవర్గంలో వాట్సాప్ స్టేటస్ గా మారిపోయింది. దీనికి రకరకాల కామెంట్లు జోడిస్తూ మునుగోడు ప్రజలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తుండటంతో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 14 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి మంత్రిని ఇంచార్జుగా నియమించింది. సీఎం కేసీఆర్ కూడా లెంకలపల్లి గ్రామ ఇంచార్జుగా ఉన్నారు. బీజేపీ ప్రచారం కోసం కేంద్రమంత్రులు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా మునుగోడులోనే తిరుగుతన్నారు. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనే కసితో టీపీసీసీ నేతలంతా శ్రమిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు మునుగోడు బైపోల్ కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నారు,
మునుగోడు ఓటర్లకు హామీలపై హామీలు గుప్పిస్తున్నారు. పోలింగ్ ఇంకా 20 రోజుల సమయం ఉండగానే ఓట్లను కొనేస్తున్నారు. అడిగిన వారికి అడగని వారికి అన్నట్టుగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటివరకు అభివృద్ధికి కూడా పైసలు లేవన్న అధికార పార్టీ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అన్ని పార్టీలు పోటీ పడి మరీ ఓటర్లకు వేలకు వేలు పంచేస్తున్నాయి. ఓటుకు ఎంతైనా ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ నాటికి మరింతగా డబ్బుల పంపకం ఉండవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి అనే స్లోగన్ మార్మోగుతోంది. దీన్ని స్టేటస్ గా పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు మునుగోడు యువకులు.
Also Read : MLC Kavitha: లిక్కర్ స్కాంలో సీబీఐ అరెస్టులు.. ఢిల్లీలో కవిత! ఏం జరగబోతోంది?
Also Read : Impact Player: క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి