ABVP workers protests against Minister KTR: నారాయణపేట: మంత్రి కేటీఆర్ చేపట్టిన జిల్లా పర్యటనలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణ ప్రగతిలో భాగంగా సైన్స్ పార్క్, చిల్డ్రన్ పార్క్, జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డును ప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు (ABVP activists) అడ్డుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏబివిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టినట్టు తెలుస్తోంది.
Also read : Coronavirus Variants: కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమవుతున్న వేరియంట్లు ఇవేనా..కారణాలేంటి
ఇదిలావుంటే, మరోవైపు మంత్రి కేటీఆర్ (Minister KTR) నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే స్థానిక బీజేపీ నాయకులను, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపి తీవ్రంగా ఖండించింది. తాము ఎలాంటి ముందస్తు నిరసనలకు పిలుపు ఇవ్వనప్పుడు తమని ఎలా అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు (BJP in Telangana) నిలదీస్తున్నారు.
Also read : Kappa variant cases: ఉత్తర్ ప్రదేశ్‌లో కప్ప వేరియంట్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook