Granules india to supply 16 cr Paracetamol 500 mg tablets: హైదరాబాద్: కరోనాపై పోరులో తమ వంతు కృషిగా తెలంగాణ ప్రభుత్వానికి 16 కోట్ల పారాసిటమోల్ ట్యాబ్లెట్స్ ఉచితంగా అందివ్వనున్నట్టు పారాసిటమోల్ ట్యాబ్లెట్ల తయారీలో పేరున్న ఫార్మాసుటికల్ కంపెనీ అయిన గ్రాన్యుయెల్స్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్స్ విలువ సుమారు 8 కోట్లు ఉంటుందని కంపెనీ తెలిపింది. కరోనా చికిత్సలో భాగంగా కొవిడ్-19 రోగులకు ఇస్తున్న పారాసిటమోల్ ట్యాబ్లెట్స్‌ని ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గ్రాన్యుయెల్స్ ఇండియా వెల్లడించింది. గ్రాన్యూయెల్స్ ఇండియా యాజమానులు కృష్ణ ప్రసాద్, ఉమాదేవి చిగురుపాటి దంపతుల తరపున కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు.
Thanks to @GranulesIndia Ltd for coming forward to donate Paracetamol 500 mg tablets during the current #Covid pandemic. The firm will be providing 1 Cr tablets per week to Govt of Telangana, aggregating to 16 Cr tablets worth Rs. 8 Crore: Minister @KTRTRS pic.twitter.com/lFYgMTkxKo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 12, 2021
Also read : Liquor Sales: లాక్‌డౌన్ ప్రభావంతో ..రెండ్రోజుల్లో 2 వందల కోట్ల మద్యం అమ్మకాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారానికి కోటి పారాసిటమోల్ 500 ఎంజీ ట్యాబ్లెట్స్ (Paracetamol 500 mg tablets) చొప్పున నాలుగు నెలల పాటు రాష్ట్రానికి 16 కోట్ల పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా రోగులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చిన గ్రాన్యూల్స్ ఇండియా సంస్థకు మంత్రి కేటీఆర్ (Minister KTR) కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook