AP Politics: వైసీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో చేరగా.. మరో ఎమ్మెల్సీ జనసేన పార్టీలో చేరారు.
AP Politics: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదో తెలియని గందరగోళం కన్పిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజుకుంటోందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన వ్యతిరేకత నివురుగప్పుకుంటోందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీలో అసలేం జరుగుతోంది..
MLA Kotamreddy : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వంతెన నిర్మాణం చేయాలంటూ జలదీక్ష చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డితో మాట్లాడిన ఆడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకెళ్తామంటూ హెచ్చరించారు.
Kotamreddy: మంత్రి కాకాణిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్‌తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని అప్పట్లో చెప్పలేదా అని మంత్రి కాకాణిని ప్రశ్నించారు. వైఎస్ వీరవిధేయుడిని అని చెబుతున్న కాకాణి...
KotamReddy: తనపై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులొస్తాయో తనకు తెలుసన్నారు.
Phone Tapping: ఆంధ్రప్రదేశ్‌లో నేతల ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ప్రతిపక్షం తెలుగుదేశం నేతల ఆరోపణలకు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
Kotamreddy Sridhar Reddy: ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అంటే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఏ చెప్పినా వెంటనే చేసేస్తుంటారు. కాని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ మారోలా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
MLA Kotamreddy Sridhar Reddy meets Amaravati farmers: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులను కలిసి ముచ్చటించారు. రైతుల పాదయాత్ర నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడమే తప్ప.. మొదటిసారి ఓ ఎమ్మెల్యే ఇలా సంఘీభావం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నిత్యం 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.