/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలు ఎక్కువౌతున్నాయి. గతంలో టీడీపీ..ఇప్పడు వైసీపీ ప్రభుత్వాలపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం గమనార్హం.

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీ, ఇప్పుడు ఇప్పటి ప్రతిపక్షం టీడీపీ ప్రధానంగా చేసిన ఆరోపణలు ప్రత్యర్ధుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనేదే. ఈసారి అధికార పార్టీపై టీడీపీతో పాటు సొంత పార్టీ నుంచి కూడా ఈ ఆరోపణలు రావడం విశేషం. సాంత పార్టీ నేతలపై కూడా ట్యాపింగ్ అస్త్రాన్ని సంధిస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ అంశాన్ని నిర్ధారిస్తూ ఆరోపణలు చేయడం ఇందుకు బలం చేకూరుతుంది. 

ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీలోని కీలకనేతల కదలికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిఘా పెట్టిందనేది ప్రధాన ఆరోపణ. దీనికోతోడు అధికార పార్టీ ఎమ్మల్యే ఒకరు తాజాగా ఇవే ఆరోపణలుచేయడంతో అధికార పార్టీపై వచ్చే ఆరోపణలకు బలం చేకూరుతోంది. గత కొద్దికాలంగా అధిష్టానంతో మనస్థాపం చెంది ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయిందని సన్నిహితుల సమక్షంలో ఆవేదన చెందారు. బహిరంగంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 8 నెలల్నించి ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని..అందుకే 12 సిమ్‌లు మార్చాల్సి వచ్చిందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ట్యాపింగ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో టీడీపీ అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

కోటంరెడ్డి అనుమానాల వెనుక

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుమానాల వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. పలు విషయాల్లో తన అసంతృప్తిని వెళ్లగక్కేందుకు ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఆక్కడ సీఎం జగన్ చెప్పిన విషయాలతో కోటంరెడ్డి ఖంగు తినాల్సి వచ్చింది. కారణం స్థానికంగా నెల్లూరు రూరల్‌లో జరిగే విషయాల్ని కూలంకషంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ జరిగితే తప్ప ఆ విషయాలు బయటికొచ్చే అవకాశం లేదనేది కోటంరెడ్డి వాదన. 

ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ట్యాపింగ్ ఆరోపణల్ని తీవ్రతరం చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్న ఇంటెలిజెన్స్ ఛీఫ్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Phone tapping allegations on ap government, ruling party mla kotamreddy sridhar reddy allegations on phone tapping made sensational
News Source: 
Home Title: 

Phone Tapping: ఏపీలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సొంత పార్టీ ఎమ్మెల్యే

Phone Tapping: ఏపీలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం టార్గెట్
Caption: 
Kotamreddy sridhar reddy ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Phone Tapping: ఏపీలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సొంత పార్టీ ఎమ్మెల్యే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 31, 2023 - 11:33
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
104
Is Breaking News: 
No