సాధారణంగా సొరంగాలు రవాణా సులభతరం కోసం, దూరాన్ని తగ్గించటానికి తయారు చేస్తారు. సాధారణ ప్రజలు సొరంగాల జోలికి పోరు, మెట్రో ట్రెయిన్ వంటి వాటి కోసం ప్రభుత్వాలు సొరంగాలను తవ్వుతాయి.. కానీ కర్ణాటకలో వ్యభిచారం కోసం సొరంగం తవ్వారు.. ఆ కథేంటో చూద్దాం పదండి!
Senior Congress Leader Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Coconut @ 6.5 lakhs: ఇటీవల ఒకే ఒక బంగాళదుంప చిప్ లక్షల్లో అమ్ముడై ఆందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పుడు అటువంటిదే మరో ఘటన. ఒకే ఒక కొబ్బరికాయ వేలంలో పలికిన ధర వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ వివరాలేంటి, ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
Kerala Nipah Virus: కేరళలో విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ..మరోవైపు కొత్తగా నిఫా వైరస్ కలకలం ఆందోళన కల్గిస్తోంది. రోజురోజుకూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది.
BJP MLA's son cake cutting with iPhone: బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ వారసుడు సురేష్ తన ఖరీదైన ఐఫోన్‌తో తన బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న ఈ వీడియో (Birthday cake cutting with iPhone) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mysuru gang rape case accused arrested: మైసూరు: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాకు చెందిన కూలీలే అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.
Karnataka: కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఇప్పుడు కరోనా థర్డ్‌వేవ్ భయం పట్టుకుంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మరోసారి ఆంక్షలు విధించేందుకు అక్కడి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
Karnataka: కర్ణాటకలో కొత్త మంత్రిమండలి ఏర్పడింది. శాఖల కేటాయింపుపై అసంతృప్తి రేగుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలు ఆకస్మికంగా భేటీ అయ్యారు. అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు ప్రారంభించారు.
Karnataka: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందనే ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరం కల్గిస్తోంది. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలకు దిగుతోంది.
Karnataka cabinet expansion live updates: బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై అధికారం చేపట్టాకా తొలిసారిగా చేపట్టిన కేబినెట్ విస్తరణ పూర్తయింది. బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మొత్తం 29 మంది మంత్రులు కొత్తగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్లో 29 మంది కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) ప్రమాణ స్వీకారం చేయించారు.
Karnataka: కర్ణాటక నూతన మంత్రిమండలి జాబితా రేపు విడుదల కానుంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధిష్టానంతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనే వివరాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
Tamilnadu: కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆంక్షలు విధించగా..ఇప్పుడు తమిళనాడు కూడా ఆంక్షలు జారీ చేసింది.
Karnataka: కరోనా థర్డ్‌వేవ్ దేశంలో ప్రారంభమైపోయిందా..కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు దేనికి నిదర్శనం. ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. పొరుగు రాష్ట్రాల్నించి ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి.
CM Basavaraj Bommai praises BS Yediyurappa: బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రజారంజకమైన పరిపాలన అందించారని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. అందుకే తాను కూడా యడియూరప్ప అడుగుజాడల్లోనే నడవనున్నట్టు బసవరాజ్ తెలిపారు.
Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం (Basavaraj Bommai's oath taking ceremony) జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
Karnataka new CM Basavaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపి ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బసవరాజు బొమ్మై బీజేపి (BJP) అధిష్టానం ఆహ్వానంతో 2008లో బీజేపీలో చేరారు.
Karnataka New CM: కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ సాగుతోంది. ప్రస్తుత హోంమంత్రికే ముఖ్యమంత్రి పీఠం వరించవచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
Karnataka: కర్ణాటక అధికార పీఠం మారనుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప..పీఠం నుంచి దిగుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్‌న్యూస్ అందించారు.
Union minister Kishan Reddy: బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన నేపథ్యంలో కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యేలంతా కలిసి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.