Tamilnadu: కేరళ, మహారాష్ట్రలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆంక్షలు విధించగా..ఇప్పుడు తమిళనాడు కూడా ఆంక్షలు జారీ చేసింది.
దేశంలో కరోనా వైరస్(Corona virus) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్నించి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలని కర్ణాటక ఆంక్షలు విధించింది. ఇప్పుడు తమిళనాడు(Tamilnadu) సైతం కేరళ రాష్ట్రంపై ఆంక్షలు విధించింది.కేరళ నుంచి వచ్చే ప్రజలు తప్పకుండా ఆర్టీపీసీఆర్ పరీక్ష(RTPCR Test) నివేదిక వెంట తీసుకురావాలని సూచిస్తోంది. ఆగస్టు 5 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి. కేరళలో రోజుకు 20 వేల వరకూ కేసులు నమోదవుతుండటమే దీనికి కారణం.
ప్రస్తుతం పరిస్థితుల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించే విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రజల్ని కోరారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది కోవిడ్ బారిన పడే అవకాశముందని..కొత్తరకం డెల్టా వైరస్ (Delta Virus)తీవ్రమైందని హెచ్చరించారు. వ్యాక్సిన్ ప్రక్రియ ముగియకుండానే కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమైతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: ఫోన్ పే, గుగుల్ పే అవసరం లేదిక..కొత్తగా ఈ రూపి..బ్యాంకు ఎక్కౌంట్ లేకుండానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కేరళ నుంచి వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి, కర్ణాటక బాటలో తమిళనాడు