Mysuru gang rape case: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు అరెస్ట్

Mysuru gang rape case accused arrested: మైసూరు: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాకు చెందిన కూలీలే అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2021, 07:15 PM IST
Mysuru gang rape case: మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు అరెస్ట్

Mysuru gang rape case accused arrested: మైసూరు: సంచలనం సృష్టించిన మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ తెలిపారు. ఇదే కేసులో పరారీలో ఉన్న ఆరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టినట్టు డీజీపీ ప్రవీణ్ సూద్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ సూద్.. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు తమిళనాడులోని తిరుప్పూరు జిల్లాకు చెందిన కూలీలే అని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు మైనర్ ఉన్నట్టు తెలుస్తోందని, ప్రస్తుతానికి తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం అతడికి 17 ఏళ్లే ఉంటాయని తెలిసిందని, అతడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

మైసూర్ గ్యాంగ్ రేప్ కేసు చాలా సున్నితమైన అంశమని అభిప్రాయపడిన కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (Karnataka DGP Praveen Sood).. ఈ కేసుకు సంబంధించి సాంకేతికంగా, శాస్త్రీయంగా తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. 

Also read: Irctc new rules: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా..?? అయితే ఇవి తప్పనిసరి..!

మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని, ఆమె స్నేహితుడు కలిసి మంగళవారం సాయంత్రం నగర శివార్లలోని పర్యాటక ప్రాంతమైన చాముండి హిల్స్‌కి (Chamundi Hills in Mysuru) వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న ఆ జంటపై దాడి చేసిన నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె స్నేహితుడిపై దాడికి పాల్పడ్డారు. మైసూరులో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ దుర్ఘటన కర్ణాటకతో (Karnataka) పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు (Mysuru gang rape case) బాధితురాలు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనందున పోలీసులు ఇంకా ఆమె నుంచి ఇంకా పూర్తి వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.

Also read : India Corona Update: దేశంలో మరోసారి పెరుగుతున్న కరోనా ఉధృతి, రెండు నెలల గరిష్టానికి కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News