Vijayashanti Likely To Join BJP: తాజాగా ఆమె రాజకీయ భవితవ్యం ఏంటనే అంశంపై తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయశాంతి రాజకీయం ఎటువైపు దానిపై స్పష్టత లభించింది. రేపు ఉదయం భారతీయ జనతా పార్టీలో విజయశాంతి చేరనున్నారు. లేడీ సూపర్ స్టార్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయశాంతి.
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీజేపి జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన డీకే అరుణ ( Dk Aruna ), ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరికి ( Daggubati Purandeswari ) జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు దక్కాయి. డికె అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించిన బీజేపి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది.
బీహార్ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపార్టీలను ధీటుగా ఎదుర్కొని.. మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం హస్తగతం చేసుకున్న నేత వాజ్‌పేయి. ఆయన రెండో వర్ధంతి (Vajpayee Death Anniversary)ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ ప్రముఖులు నివాళులర్పించారు.
తెలంగాణ సర్కార్‌పై బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus ) అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జేపి నడ్డా మండిపడ్డారు.
Telangana politics: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt)పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) నిరాధార ఆరోపణలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Minister Etela Rajender) విమర్శలు గుప్పించారు.
ఓ వర్గానికి చెందిన అమ్మకపుదారుల వద్ద కూరగాయలు కొనవద్దన్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా ఘాటుగా స్పందించారు.
మధ్యప్రదేశ్‌లో తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం (Kamal Nath`s govt) కోల్పోవడానికి కారణమైన 22 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (22 Congress rebel MLAs joins BJP) నేడు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 2014లో తాను బీజేపికి అధ్యక్షుడిని అయినప్పటి నుంచి బాబూలాల్‌ని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
భారతీయ జనతా పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ ఆరోగ్య శాఖా మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సోమవారం ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నికకు గాను 21 రాష్ట్ర యూనిట్లు, పార్లమెంటరీ పార్టీల బలమైన మద్దతుతో ఎన్నికయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఈ పదవిని జేపి నడ్డా స్వీకరించబోయేముందు ఐదున్నర సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.