LK Advani Birthday: అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉప‌ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్‌కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Last Updated : Nov 8, 2020, 12:14 PM IST
LK Advani Birthday: అగ్రనేతకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Narendra Modi wishes senior BJP leader LK Advani: న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉప‌ప్ర‌ధాని ఎల్‌కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్‌కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీని అనువణువున తీసుకెళ్లడంతోపాటు దేశాభివృద్ధిలో కీల పాత్ర పోషించిన అద్వానీ జీకి శుభాకాంక్ష‌లు. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయ‌న‌ సజీవ ప్రేరణ.. స్ఫూర్తి.. ఆయ‌న జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.. అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

దీంతోపాటు ప్రధాని మోదీ ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్ర‌ధానితోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా (JP Nadda) కూడా ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అగ్రనేత అద్వానీతో వారంతా కలిసి కేక్ కట్ చేయించారు.  Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇదిలాఉంటే.. బీజేపీ అగ్రనేత అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలందరూ ఆయనకు శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభిమాన నేతను కొనియాడుతూ పోస్టులు చేస్తున్నారు. 

Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News