Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్

టీఆర్‌ఎస్‌ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.

Last Updated : Nov 26, 2020, 06:30 AM IST
  • ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
  • పదవుల కోసం బీజేపీలో చేరలేదని, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే బీజేపీలో చేరానని స్వామిగౌడ్ స్పష్టంచేశారు.
Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్

TRS leader Swamy Goud joins BJP: న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు జేపీ నడ్డా బీజేపీ కండువాను స్వామిగౌడ్‌కు కప్పి బుధవారం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామిగౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరడమంటే తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన పేర్కొన్నారు. ఆత్మాభిమానం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రావడం దురదృష్టకరమని తెలిపారు. స్వారాష్ట్రం వచ్చిన ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమంలో ఒక్కరోజూ కూడా ధర్నా చేయని, జెండా పట్టని ఇతర పార్టీల పెద్దలకు ప్రధాన పదవులు ఇచ్చి..  టీఆర్‌ఎస్‌ (TRS) ఉద్యమకారులను దూరం పెట్టిందని స్వామిగౌడ్ పేర్కొన్నారు. 

బీజేపీలో చేరిన స్వామిగౌడ్

సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని స్వామిగౌడ్ పేర్కొన్నరాు. గత రెండేళ్లలో సీఎం కేసీఆర్‌ను కనీసం 100 సార్లు అపాయింట్‌మెంట్‌ అడిగానని, ప్రతీసారి రేపు కలుద్దామనే సమాచారం వచ్చేదని, తాజాగా వారం క్రితం కూడా అడిగానని ఆవేదన వ్యక్తంచేశారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే బీజేపీలో చేరానని స్వామిగౌడ్ స్పష్టంచేశారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC) కూడా భారతీయ జనతా పార్టీ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.  Also read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,122 మంది 

Also read: Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News