Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం

కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌, పలు సంఘాలు  పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.

Last Updated : Dec 1, 2020, 11:44 AM IST
  • కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌, పలు సంఘాలు పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది.
  • మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం అర్థరాత్రి తర్వాత ప్రకటించారు.
  • రైతులతో చర్చలు జరిపే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంటికి చేరుకోని ఆయనతో సమావేశమయ్యారు.
Delhi Chalo: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నేడు కేంద్రంతో సమావేశం

Delhi Chalo farmer's protest 6th day: న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు ( Agricultural bills ) వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌, పలు సంఘాలు  పిలుపునిచ్చిన ఢిల్లీ ఛలో మార్చ్‌ (Delhi Chalo protest) నిరసన మంగళవారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆరు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ రైతులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. ఇంకా ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో చర్చల విషయంలో ప్రతిష్టంభన తలెత్తింది. ముందుగా డిసెంబరు 3న రైతులతో చర్చలుంటాయని పేర్కొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర  సింగ్ తోమర్.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం అర్థరాత్రి తర్వాత ప్రకటించారు. Also read: Delhi Chalo protest: రైతులకు రాజధాని ఢిల్లీలోకి అనుమతి

మొదట డిసెంబర్ 3న సమావేశం జరపాలని నవంబర్ 13న నిర్ణయం తీసుకున్నామని.. అయితే రైతులు ఆందోళన వైపే మొగ్గుచూపుతున్న కారణంగా రైతు సంఘం ప్రతినిధులతో డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో సమావేశం జరపాలని నిర్ణయించామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. చలితో పాటు కరోనావైరస్ వ్యాప్తి ఢిల్లీని పట్టిపీడిస్తోంది. కావున నిరసనలకు స్వస్తి చెప్పి.. చర్చల ద్వారా ఒక పరిష్కారం కనుగొందాం అంటూ నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

రైతులతో చర్చలు జరిపే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంటికి చేరుకోని ఆయనతో సమావేశమయ్యారు. Also read: Delhi Chalo protest: ఉద్రిక్తంగా ‘ఢిల్లీ ఛలో’ మార్చ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News