Telangana politics: హైదరాబాద్: కరోనావైరస్ ( Coronavirus) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt)పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP chief JP Nadda) నిరాధార ఆరోపణలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ (Minister Etela Rajender) విమర్శలు గుప్పించారు.
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
కరోనా వైరస్ నివారణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రోగుల చికిత్స కోసం ఉపయోగిస్తున్న వైద్యపరికరాలు, మందులను వ్యాపార సంస్థలు బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తిచేశారు.
గుడిసెల్లో ఉండేవారికి, ప్లాస్టిక్ కవర్లనే నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారికే ముందుగా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 500 డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ కోసం సిద్ధమవుతున్నాయని మంత్రి చెప్పారు.
మంత్రి పదవి మీరు పెట్టిన భిక్ష. మీరే హక్కుదారులు. నా కారులో మీరు పెట్రోలు పోస్తే నేను తిరుగుతున్నాను అనే విషయాన్ని ప్రతీక్షణం గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నానని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్లో "పట్టణ ప్రగతి" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.