Congress rebel MLAs joins BJP: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్‌లో తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం (Kamal Nath`s govt) కోల్పోవడానికి కారణమైన 22 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (22 Congress rebel MLAs joins BJP) నేడు బీజేపీలో చేరారు.

Last Updated : Mar 21, 2020, 10:49 PM IST
Congress rebel MLAs joins BJP: బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

న్యూ ఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం (Kamal Nath`s govt) కోల్పోవడానికి కారణమైన 22 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (22 Congress rebel MLAs joins BJP) నేడు బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో జరిగిన కార్యక్రమంలో నడ్డా, జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) సమక్షంలో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మీడియాతో మాట్లాడుతూ ''జేపి నడ్డా ఆశీస్సులతో 22 మంది ఎమ్మెల్యేలు నేడు బీజేపీలో చేరారు'' అని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ టికెట్స్ లభిస్తాయని.. పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని జేపి నడ్డా హామీ ఇచ్చారని సింధియా పేర్కొన్నారు. 

Read also : జ్యోతిరాదిత్య సింధియపై ఫోర్జరీ కేసు రీఓపెన్

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను శనివారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి ఆమోదించారు. రాజీనామా చేసిన వారిలో ఇమర్తి దేవి, తులసి సిలావత్, ప్రద్యుమన్ సింగ్ తోమర్, మహేంద్ర సింగ్ సిసోడియా, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ప్రభురాం చౌదరి ఉన్నారు. అధికారాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో శుక్రవారం కమల్ నాథ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (Kamal Nath`s resignation) చేసిన సంగతి తెలిసిందే.   

Read also: మధ్యప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ?

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కమల్ నాథ్... ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ప్రస్తావిస్తూ దేశంలో ప్రజాస్వామ్యం విలువలు మరింత దిగజారాయని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అంతకంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని వీడిన జ్యోతిరాదిత్య సింధియా సైతం కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. తన రాష్ట్రం కోసం, తన దేశం కోసం ఎంతో చేయాలనే తన లక్ష్యంలో ఏ మాత్రం మార్పు ఉండదని.. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే తాను ఏమీ చేయలేననే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News