Vijayashanti Likely To Join BJP : లేడీ సూపర్ స్టార్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయశాంతి. హీరోయిన్లకు అగ్రతాంబూలం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన విజయశాంతి అనంతర కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు. తాజాగా ఆమె రాజకీయ భవితవ్యం ఏంటనే అంశంపై తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో విజయశాంతి రాజకీయం ఎటువైపు దానిపై స్పష్టత లభించింది. రేపు ఉదయం భారతీయ జనతా పార్టీలో విజయశాంతి చేరనున్నారు.
డిసెంబర్ 7న ఉదయం ఉదయం 11 గంటలకు విజయశాంతి (Vijayashanti) బీజేపీలో చేరనున్నారని బీజేపీ శ్రేణుల సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో నటి విజయశాంతి పార్టీ సభ్యత్వం (Vijayashanti To Join BJP) తీసుకోనున్నారు. గత కొన్నిరోజులుగా ఈ విషయంపై కమ్ముకున్న నీలినీడలు తాజా అప్‌డేట్‌తో తొలగిపోనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నేతలకు ఆహ్వానం పలుకుతోంది.
Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయంతో తమ విజయం మొదలైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గతంలో టీఆర్ఎస్‌లో కొనసాగిన విజయశాంతి తనకు పార్టీలో అంతగా పొసగక పోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార బాధ్యతలు సైతం నిర్వహించారు విజయశాంతి. ఆ పార్టీ తెలంగాణలో పుంజుకునే అవకాశం లేకపోవడంతో రాజీనామా చేసి, రాములమ్మ రూట్ మార్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : Bigg Boss Telugu 4: ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్ అఖిల్.. డేంజర్ జోన్‌లో అతడే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Vijayashanti: బీజేపీలో చేరనున్న విజయశాంతి.. ముహూర్తం ఖరారు