నేడు (ఆగస్టు 16న) భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. భారతీయ జనతా పార్టీ (BJP) మేరు శిఖరం వాజ్పేయి రెండో వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ ప్రముఖులు (PM Modi pays tributes to Atal Bihari Vajpayee) నివాళులర్పించారు. ఈ పుణ్యతిథిన అజల్జీకి ఘన నివాళులు. ఆ మహనీయుడి సేవల్ని భారత ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఓ ట్వీట్ చేశారు. వాజ్పేయికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం
Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd
— Narendra Modi (@narendramodi) August 16, 2020
దివంగత ప్రధాని, బీజేపీ నేత వాజ్పేయికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda pays tributes to Vajpayee) నివాళులర్పించారు. నేటి ఉదయం ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలు మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది
కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపార్టీలను ధీటుగా ఎదుర్కొని.. మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం హస్తగతం చేసుకున్న నేత వాజ్పేయి. ప్రధానిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసిన తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్పేయి నిలిచారు. ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగిస్తున్నారు. Rana Daggubati: రానాకు ప్రేమతో మిహికా.. వైరల్ అవుతోన్న పోస్ట్