Bihar Elections: బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసే పోరాటం: నడ్డా

బీహార్‌ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు. 

Last Updated : Aug 23, 2020, 06:17 PM IST
Bihar Elections: బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసే పోరాటం: నడ్డా

BJP Chief JP Nadda: న్యూఢిల్లీ: బీహార్‌ ఎన్నికల్లో పోటీ గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jagat Prakash Nadda ) కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ( Nitish Kumar ) సారథ్యంలోభారతీయ జనతా పార్టీ (BJP), జనతాదళ్ యునైటెడ్ (JDU), లోక్ జనశక్తి పార్టీ (LJP) కలిసి పోటీ చేస్తాయని నడ్డా స్పష్టంచేశారు. ఆదివారం నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ రాష్ట్ర బీజేపీ కార్యసమితిని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభలో పోటీచేసిన విధంగానే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసికట్టుగా పోటీ చేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో బీజేపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సభ్యులకు ఆదేశించారు. బీజేపీలోనే కాకుండా ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీలోనూ విలువలు ప్రకాశింపజేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని నడ్డా (JP Nadda ) అభిప్రాయపడ్డారు. Also read: Narendra Modi: నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

ఇదిలాఉంటే.. కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఇటీవల బీహార్ విపక్ష పార్టీలు ఆర్జేడీ (RJD), కాంగ్రెస్ (Congress), తదితర పార్టీలు ఎన్నికల కమిషన్‌ను కోరగా.. దానిని ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. పకడ్భందీ చర్యలు తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామని స్పష్టంచేసింది. అయితే అక్టోబరు- నవంబరు మధ్య ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో బీజేపీ అడుగులు వేస్తోంది.  Also read: JEE-NEET Exams: విద్యార్థుల మ‌న్ కీ బాత్ వినండి: రాహుల్ గాంధీ

Trending News