Sunrisers Hyderabad Full Squad | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ సంచలనాలు నమోదు చేసే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021లో మరోసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలో గత ఏడాది కీలక ఆటగాళ్లు గాయంతో దూరమైనా ప్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టైటిల్ పోరుకు చేరలేకపోయింది. ఈ ఏడాది ఆ లోటును భర్తీ చేసేందుకు సన్‌రైజర్స్ సిద్ధంగా ఉంది.
రిటెయిన్డ్ ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, మహమ్మద్ నబి, జాసన్ రాయ్, జాసన్ హోల్డర్, విజయ్ శంకర్, శ్రీవాత్స గోస్వామి, వృద్దిమాన్ సాహా, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, బాసిల్ థంపి, టి. నటరాజన్, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్. వదులుకున్న ఆటగాళ్లు: బిల్లీ స్టాన్లేక్, ఫాబియన్ అలెన్, సందీప్ బవనక, సంజయ్ యాదవ్ మరియు పృథ్వీ రాజ్ యర్రా కొత్తగా చేరిన ఆటగాళ్లు: కేదార్ జాదవ్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, జగదీషా సుచిత్ Also Read: IPL 2021: ముంబై ఇండియన్స్‌కు భారీ ఊరట, ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి COVID-19 నెగెటివ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ టి నటరాజన్ గత సీజన్లో 16 మ్యాచ్‌లాడిన టి నటరాజన్ 16 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 8.02 కాగా, డెత్ ఓవర్లలో ప్రమాదకారిగా మారాడు. యార్కర్స్ నైపుణ్యంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. Also Read: Also Read: Shreyas Iyer: ఐపీఎల్ 2021కు దూరమైనా పూర్తి వేతనం అందుకోనున్న శ్రేయస్ అయ్యర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ గత సీజన్లో కేవలం 7 మ్యాచ్‌లాడిన జేసన్ హోల్డర్ 14 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగల ఆల్ రౌండర్. వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం సైతం హోల్డర్ సొంతం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే నెం. 3 స్థానంలో బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాడు. గత సీజన్లో 16 మ్యాచ్‌లాడి 32.69 సగటుతో 425 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో 3 అర్ధశతకాలుండగా, రాజస్థాన్ రాయల్స్‌పై 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. Also Read: IPL 2021: ఐపీఎల్ 2021 నిర్వహణపై BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ లెగ్ బ్రేక్ బౌలర్. గత సీజన్లో రషీద్ ఖాన్ 16 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఎకానమీ 5.37 మాత్రమే. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటగల సమర్థుడు రషీద్. టీ20 ఫార్మాట్‌కి తగిన క్రికెటర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ కెరీర్లో 121 మ్యాచ్‌లలో 136 వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్. బౌలింగ్ ఎకానమీ 7.23. కానీ గత సీజన్లో నాలుగో మ్యాచ్‌లోనే గాయపడి ఐపీఎల్ 2020కు దూరమయ్యాడు. Also Read: IPL 2021 Mumbai Indians Squad: డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, వారి గణాంకాలు, పూర్తి వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్. కెప్టెన్సీలోనూ డేవిడ్ వార్నర్‌కు సలహాలు, సూచనలు ఇస్తాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లాడిన కేన్ విలియమ్సన్ 3 అర్ధ శతకాల సాయంతో 317 పరుగులు సాధించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. వార్నర్‌తో కలిసి అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించాడు. గత సీజన్లో 11 మ్యాచ్‌లలో 345 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 31.36. వికెట్ కీపర్‌గానూ సేవలు అందించగల ఆటగాడు. Also Read: IPL 2021: ఐపీఎల్ ప్రారంభానికి ముందే CSKకు ఎదురుదెబ్బ, Josh Hazlewood గుడ్ బై
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్‌గా, కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లలో 548 పరుగులు సాధించి సన్‌రైజర్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నాలుగు అర్ధ శతకాల సాయంతో 39.14 సగటుతో బ్యాటింగ్ చేశాడు వార్నర్. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook