IPL 2021 Funny Memes: ఐపీఎల్ 2021పై వైరల్ అవుతున్న మీమ్స్, జోక్స్ మీకోసం

 ఖరీదైన టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్లు టైటిల్‌పై కన్నేశారు. నేటి రాత్రి 7:30 గంటల నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రత్యక్ష ప్రసారం కానుంది.

IPL 2021 Funny Memes And Jokes: ఖరీదైన టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్లు టైటిల్‌పై కన్నేశారు. నేటి రాత్రి 7:30 గంటల నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రత్యక్ష ప్రసారం కానుంది.

1 /10

Funny Memes On IPL 2021 | నేడు చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ముూడుసార్లు ఫైనలిస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ 2020 తరహాలోనే ఆటగాళ్ల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐపీఎల్ 2021పై ఫ్యాన్స్ సరదాగా ఫన్నీ మీమ్స్ చేసి పోస్టు చేస్తున్నారు. (Photos Credit: Twitter) Also Read: MI vs RCB Match Timings: ఐపీఎల్ 2021 ప్రారంభం నేడే, చెన్నై వేదికగా తలపడనున్న ముంబై ఇండియన్స్, ఆర్సీబీ

2 /10

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు సొంత వేదికలలో ఏ జట్టు కూడా మ్యాచ్‌లు ఆడకుండా ఐపీఎల్ 2021 ప్లాన్ చేశారు.

3 /10

దేశంలో ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తున్నా ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్సీబీ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కరోనా నుంచి కోలుకున్నాడు.  Also Read: MI vs RCB IPL 2021: ఐపీఎల్ ప్రారంభానికి ముందే తన లక్ష్యమేంటో చెప్పిన మహమ్మద్ సిరాజ్

4 /10

మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఇటీవల జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలలో అందరికీ కోవిడ్-19 నెగెటివ్ రావడం రోహిత్ శర్మ సారథ్యంలోని శిబిరంలో సంతోషాన్ని నింపింది. 

5 /10

గత కరోనా కేసుల నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించారు. కానీ అప్పటితో పోల్చితే ప్రస్తుతం రెట్టింపు కరోనా కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. Also Read: Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు, వారి ప్రదర్శన వివరాలు

6 /10

అయితే ఐపీఎల్ 2021 చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ తొలిపోరుకు సిద్ధంగా ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఆర్సీబీ, ముంబై జట్లకు సారథులుగా ఉన్నారు. నేటి మ్యాచ్ వివరాలు మీకోసం.

7 /10

తొలి మ్యాచ్ ఎవరికి; ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్. వేదిక: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ముంబై, ఆర్సీబీ తలపడనున్నాయి.

8 /10

టాస్ టైమింగ్: నేటి రాత్రి 7 గంటలకు టాస్ వేయనున్నారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎక్కడ వీక్షించాలి: డిస్నీ + హాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులోనూ ఐపీఎల్‌ను ఆస్వాదించవచ్చు. Also Read: IPL 2021 Mumbai Indians Squad: డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్, వారి గణాంకాలు, పూర్తి వివరాలు

9 /10

10 /10

Note: ఐపీఎల్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పోస్టులను సరదాగా నవ్వుకునేందుకు ఇక్కడ అందిస్తున్నాం. ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ఐపీఎల్ 2021.. (Photos Credit: Twitter) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook