ఓ వైపు కరోనాతో మ్యాచ్‌లు, ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వహణ సాధ్యపడటం లేదు. మరోవైపు బీసీసీలో రాజీనామాలు (Saba Karim Quits As BCCI General Manager) కొనసాగుతున్నాయి. బోర్డులు అసలు ఏం జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
IPL 2020 Venue: ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ( BCCI ) ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ.. ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అప్పుడే అబుదాబిలో ఐపిఎల్ నిర్వహణకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీ సిబ్బంది ఐఏఎన్ఎస్తో స్వయంగా చెప్పిన విషయం ఇది.
IPL 2020 updates: ఐపిఎల్ 2020 టోర్నమెంట్‌ను న్యూజీలాండ్‌లో నిర్వహించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిందని బీసీసీఐ ( BCCI ) చెబుతున్నప్పటికీ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( NZC ) మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది.
ఆసియాకప్-2020 రద్దైనట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ప్రకటించారు. కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి వల్ల ఇప్పటికే పలు టోర్నమెంట్లు వాయిదా పడ్డాయని, మరికొన్ని రద్దు కూడా అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ 20 ప్రపంచ కప్ ఏర్పాట్లపై ఐసీసీ నిర్ణయాన్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ అసహనం వ్యక్తం చేస్తోంది.
ఈ ఏడాది ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహించి తీరుతామని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఖాళీ స్టేడియాల్లోనైనా సరే ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.
భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్నదానిపై పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ స్పందించడంతో పాటు ఇక చర్చలొద్దు అని వ్యాఖ్యానించడం విశేషం.
సురేష్ రైనా క్రికెట్ కెరీర్‌పై, అతడి టాలెంట్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ( Rohit sharma`s interesting comments on Suresh Raina ). సురేష్ రైనాతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. దేశం కోసం చాలా ఏళ్ల పాటు ఆడిన తర్వాత జట్టుకు దూరంగా ఉండాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తనకు తెలుసని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలను అని వ్యాఖ్యానించాడు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ టోర్నమెంట్స్ వాయిదా పడటంతో అన్ని దేశాలకు చెందిన క్రికెట్ బోర్డ్స్ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న విషయం తాజాగా ఐసిసి నిర్వహించిన సమావేశంలో చర్చకొచ్చింది. అయితే, ఇదే ఐసిసి సమావేశంలో బీసీసీఐ ప్రతినిధిగా పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి జే షా.. ఈ విషయంలో ఐసిసికి ఓ ప్రతిపాదన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.