ముంబై: బీసీసీఐ(BCCI)లో మరో కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేశాడు. బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్ సబా కరీం (Saba Karim) తన పదివికి రాజీనామా చేశాడు. ఆయన ప్రస్తుతం నోటీసు పీరియడ్‌లో వర్క్ చేస్తున్నారని సమాచారం. డొమోస్టిక్ క్రికెట్ (దేశవాలీ క్రికెట్ మ్యాచ్‌ల) ప్రణాళికల రూపకల్పనలో సబా కరీం పనితీరు నచ్చక ఆయన తొలగించాలని నిర్ణయానికి రాగా, స్వయంగా రాజీనామా చేయించిందని ప్రచారం జరుగుతోంది. MS Dhoni: ధోనీపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా తరఫున సబా కరీం 32 వన్డేలు, ఓ టెస్టులో ప్రాతినిథ్యం వహించాడు. 2017లో సబా కరీంను బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా నియమించారు. దేశవాలీ క్రికెట్‌లో ప్రణాళికల రూపకల్పనలో సబా కరీం పనితీరు నచ్చకనే ఆయనతో బీసీసీఐ రాజీనామా చేయించిందని (Saba Karim Resigned) ఓ అధికారి వెల్లడించాడు. రాజీనామా సమర్పించినట్లు స్పష్టం చేశాడు. త్వరలోనే కొత్త జనరల్ మేనేజర్‌ను బీసీసీఐ నియమించనుందని తెలిపాడు. మోడల్ Shweta Mehta Hot Photos వైరల్
ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్, ఇతరత్రా ఏ క్రికెట్ టోర్నీలు మార్చి నుంచి జరగడం లేదని తెలిసిందే. ఈ సమయంలో కరీంను తప్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల బీసీసీఐ రాహుల్ జోహ్రీ సైతం రాజీనామా చేయడం తెలిసిందే. గతేడాది చివర్లో బీసీసీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..