వీక్షకులు లేకుండా IPL.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే!

తన వరకైతే ట్వంటీ20 వరల్డ్ కప్ (2007), ఛాంపియన్స్ ట్రోఫీలు (2013) నెగ్గానని, వన్డే వరల్డ్ కప్ విజయం తీరని కోరికగా మిగిలిందన్నాడు రోహిత్ శర్మ.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 23, 2020, 05:20 PM IST
వీక్షకులు లేకుండా IPL.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే!

ప్రపంచ కప్ గెలవాలనేది ప్రతి క్రికెటర్ కల అని హిట్ మ్యాన్ భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అన్నాడు. తన వరకైతే ట్వంటీ20 వరల్డ్ కప్ (2007), ఛాంపియన్స్ ట్రోఫీలు (2013) నెగ్గానని, అయితే వన్డే వరల్డ్ కప్ విజయం తీరని కోరికగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విధ్వసంక ఓపెనర్. కరోనా వైరస్ వల్ల అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందని, టీ20 వరల్డ్ కప్ జరిగేలా కనిపించడం లేదన్నాడు. SBI నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మరిచిపోయారా.. ఇలా చేయండి

అందరూ ఇళ్లల్లో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడాలంటేనే చాలా కొత్త అనుభూతి. కానీ ఫ్యాన్స్ దీన్ని ఎలా తీసుకుంటారో చెప్పలేం. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఎప్పుడు ఆడానా అని ఆలోచిస్తే చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుగా అంత సౌకర్యవంతమైన, టెక్నాలజీతో కూడిన స్టేడియాలు అప్పట్లో లేవు. కాలం ఎన్నో మార్పులు తీసుకొస్తుంది.   Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

స్టేడియాలు తెరుచుకుంటే మ్యాచ్‌ల నిర్వహణకు సైతం అనుమతి లభిస్తుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఓ పద్ధతి ప్రకారం, పలు జాగ్రత్తలతో మ్యాచ్‌లు జరుపుతారని భావిస్తా. మ్యాచ్‌లు జరిగే నగరంలో ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొస్తే వాటిని అనుసరించాలి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచ కప్ నిర్వహించడం అసాధ్యం. త్వరలోనే అంతా చక్కదిద్దుకుని మ్యాచ్‌లకు సిద్ధమయ్యే వాతావరణం ఏర్పడాలని’ రోహిత్ శర్మ ఆకాక్షించాడు.    Photos: లేటు వయసులో బికినీ అందాలు

కాగా, గతేడాది ఇంగ్లాండ్ గడ్డ మీద జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ అద్వితీయ ప్రదర్శణతో భారత్ సెమీస్ వరకు వెళ్లింది. 9 మ్యాచ్‌లలో 5 శతకాల సాయంతో 648 పరుగులు చేశాడు రోహిత్. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో అత్యంత బాధ, ఆవేదనకు లోనయ్యాడు రోహిత్ శర్మ. ఫిబ్రవరిలో గాయంతో జట్టుకు దూరమైన రోహిత్ ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడు. కానీ కరోనా కారణంగా లీగ్ వాయిదా పడింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

Trending News