క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కచ్చితంగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) వెల్లడించాడు. పూర్తి జాగ్రత్తలతో ఖాళీ స్టేడియాల్లో అయినా సరే ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం ఐసీసీ బోర్డులో ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. Porn Starగా మారిన టాప్ ప్లేయర్.. ఇప్పుడు లగ్జరీ లైఫ్
ఐపీఎల్ (IPL) నిర్వహణకు మొగ్గు చూపుతున్నట్లు గంగూలీ ఐసీసీకి తెలిపారు. బోర్డు సమావేశం అనంతరం సంబంధిత బోర్డులకు టీ20 లీగ్ నిర్వహణపై తమ వైఖరిని ఓ లేఖ ద్వారా స్పష్టం చేశాడు. వీక్షకులు లేకున్నా ఖాళీ స్టేడియాల్లోనైనా సరే ఐపీఎల్ టోర్నీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ (BCCI) నిర్ణయాన్ని వెల్లడించాడు. అంతా ఓకే అయితే అక్టోబర్ సమయంలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలున్నాయి. చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు
ఐపీఎల్ కోసం భారత్, విదేశీ క్రికెటర్లు సైతం సిద్ధంగా ఉన్నారని గంగూలీ తెలిపాడు. ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు బోర్డులకు రాసిన లేఖలో గంగూలీ వివరించాడు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్
IPLకు సిద్ధంగా ఉండాలి: సౌరవ్ గంగూలీ