IND Vs SA Test Series: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా తప్పక విజయం సాధిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత జట్టు గెలవని నేపథ్యంలో ఈసారి తాము విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టిస్తామని స్పష్టం చేశాడు.
IND Vs SA Series 2021 Schedule: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. డిసెంబరు 17 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ద్వైపాక్షిక సిరీస్ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా.. డిసెంబరు 26 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
IND Vs NZ 3rd T20 2021: కలకత్తా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో 73 పరుగులు తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
India Vs New Zealand 3rd T20: కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు మధ్య ఆఖరిదైన మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Champions Trophy Host: ఐసీసీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ వేదిక కానుంది. 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది.
Gavaskar On Vihari: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా బ్యాటర్ హనుమ విహారి ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Gavaskar on Vihari). విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
India's Squad For New Zealand Series: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ (IND Vs NZ Test Series) కోసం జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News). రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండకపోగా.. రోహిత్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Jadeja Press Conference: టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2021) శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో (India Vs Scotland) స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో తనకు ఎదురైన ప్రశ్నకు తనదైన శైలీలో చమత్కరించాడు. ఇప్పుడా వీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.