Gavaskar On Vihari: ‘టెస్టు జట్టులో విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణమదే’

Gavaskar On Vihari: న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​కు టీమ్ఇండియా బ్యాటర్ హనుమ విహారి ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ (Gavaskar on Vihari). విహారి గత కొన్ని నెలలుగా క్రికెట్​ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 09:04 AM IST
Gavaskar On Vihari: ‘టెస్టు జట్టులో విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణమదే’

Gavaskar On Vihari: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా బ్యాటర్ హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. విహారి.. గత కొన్ని నెలలుగా క్రికెట్‌ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల  దృష్టిలో పడలేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయని గవాస్కర్ చెప్పారు. నవంబర్‌ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని ఎంపిక చేయకపోవడం వల్ల సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

“నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్‌ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఆధారంగా కొంతమంది ఆటగాళ్లు సెలక్షన్ కమిటీ దృష్టిలో పడుతున్నారు. ఇలా జరుగుతుండటం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము.  హనుమ విహారి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదు” అని సునీల్ గవాస్కర్ అన్నారు.

Also Read: Finch On Warner: వార్నర్ ను తక్కువ అంచనా వేశారు: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్

Also Read: T20 World Cup 2021: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఫైనల్‌లో ఆ ముగ్గురి అరుదైన రికార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News