World cup 2019 జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు ...ఎలగెలగెలగా ?

రిటైర్డ్ మెంట్ ప్రకటించిన సచిన్ పేరు ఉండటం ఏంటని ఆశ్యర్యపోతున్నారా ? ఔనండి ఇది నిజం నమ్మలేకపోతున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది

Last Updated : Apr 18, 2019, 06:05 PM IST
World cup 2019 జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు ...ఎలగెలగెలగా ?

వరల్డ్ కప్ 2019 కోసం భారత  క్రికెట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. అయితే ఆ జాబితా రిషబ్ పంత్ , రాయుడు పేర్లు లేకపోవడం తీవ్ర విరమ్శలకు దారి తీసింది. మాజీలు సైతం ఇదే అంశాన్ని ప్రశ్నించారు. అయితే ఒక్క విషయాన్ని ఎవరూ గమనించలేక పోయారు..అదేమంటే వరల్డ్ కప్ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు చోటు కల్పించడం.

రిటైర్డ్ మెంట్ ప్రకటించిన సచిన్ పేరు ఉండటం ఏంటని ఆశ్యర్యపోతున్నారా ? అయితే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ఈ క్రింది జాబితాను ఒక్క సారి క్షుణ్ణంగా పరిశలించండి మీకే అర్థమౌతుంది

MS Dhoni
Rohit ShArma
Chahal
Virat KoHli
hardIk Pandya
Vijay ShaNkar
Dinesh KarThik
kEdar Jadav
RaviNdra jadeja
MohammaD Shami
BUmrah
KuLdeep Yadav
Bhuvaneshwar Kumar
ShikhAr Dhawan
KL Rahul

వరల్డ్ కప్ కోసం ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు దాగి ఉండటం గమనించారా ? కరెక్టే కదూ .... 15 మందిలో చోటు సంపాదించిన ఆటగాళ్ల జాబితాను తనకు తోచిన క్రమంలో  పెట్టి  ఓ అభిమాని... ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది.   లెజెండరీ క్రికెటర్ సచిన్ స్పూర్తితో వరల్డ్ కప్ గెలుచుకోవాలని కోట్లాది మంది భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు..  ఆల్ ది బెస్ట్ ఇండియా ...

Trending News