India Vs New Zealand 1st T20: టీ20 వరల్డ్ కప్ పరాభవం అనంతరం.. న్యూజిలాండ్ తో (India vs New Zealand 2021) టీ20 సిరీస్ లో టీమ్ఇండియా సత్తా చాటుతోంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా... ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. చివరి మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు టీ20 సిరీస్ లో కనీసం ఒక మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ జట్టు చూస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
Captain Rohit Sharma wins the toss and elects to bat first in the third and final T20I.
Live - https://t.co/kbSRlDEQf1 #INDvNZ @Paytm pic.twitter.com/1q9CdXBx7e
— BCCI (@BCCI) November 21, 2021
తుదిజట్లు:
టీమ్ఇండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.
న్యూజిలాండ్:
మార్టిన్ గప్తిల్, డార్యెల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ శాంటర్న్ (కెప్టెన్), ఆడమ్ మిల్నే, లూకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్.
Also Read: మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ అభిమాని.. కాళ్లపై పడి.. తరువాతేం జరిగింది..??
Also Read: ఇండియా vs న్యూజిలాండ్ 2వ టీ20 మ్యాచ్: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం... సిరీస్ భారత్ కైవసం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook