KTR Condemned Adilabad Police Lathi Charge Against Farmers: తెలంగాణలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పొలం పనులకు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాలు దొరకడం లేదు. విత్తనాల కోసం ఎగబడితే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.
Crore Of Value Diamonds Found In Kurnool District: రాయలసీమ రతనాలసీమ అనేది అక్షరసత్యమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే బంగారు గనులు సీమలో తవ్వకాలు జరిపేందుకు సిద్ధమవగా.. తాజాగా వర్షానికి సీమ జిల్లాల్లో విలువైన వజ్రాలు లభించాయి. దీంతో ప్రజలు రాత్రికి రాత్రి లక్షాధికారులు అవుతున్నారు.
Countdown Started For Revanth Reddy Govt Says KT Rama Rao: ధాన్యం కొనుగోళ్ల విషయంలో మాట మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా రేవంత్ రెడ్డిపై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రకటించారు.
Rythu Bandhu: రైతు బంధు నిధులనే రైతు భరోసా పేరుతో విడుదల చేయడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెట్టుబడి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పంట కోతల సమయంలో ఇవ్వడంపై రైతులు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
Revanth Reddy: లోక్సభ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకనుగుణంగా చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు 15వ తేదీ వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ దీనికోసం రైతుల రుణాల వివరాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రుణమాఫీపై కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రుణమాఫీ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేయకపోవడంపై తీవ్ర రాజకీయ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ కాంగ్రెస్కు ఓటేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేస్తోంది.
Delhi Haryana Borders: ఇచ్చిన మాటను తప్పిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధమయ్యారు. పంటకు కనీస మద్దతు ధరతో సహా అనేక డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దేశ రాజధాని వైపు రైతులు కదులుతున్నారు. వీరి ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ వెళ్లే రహదారుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Farmers Group Called Protest: రెండేళ్ల కిందట నల్ల చట్టాల రద్దుకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమం చేసిన రైతు సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చకపోవడంతో మరోసారి ఉద్యమ బాట పడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
Ys Jagan Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణ వేడెక్కుతోంది. అధికార పార్టీ ఒక్కొక్కటిగా జాబితాలు విడుదల చేస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా పొత్తు సమీకరణాలు దాటడం లేదు. ఈలోగా ముఖ్యమంత్రి వైఎెస్ జగన్ మరో రెండు వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Farmer Arrived In Audi A4 car : ఒక సాధారణ రైతు ఆడి కారులో వచ్చి కూరగాయలు అమ్మడం ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. ఒకవేళ అలాంటి దృశ్యం మన కంటపడితే చూడ్డానికి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా ?
Eetala Rajender Demands For MSP: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు మామిడి రైతుల కోసం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మామిడి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Farmers Loans Waiver: రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు పథకంతో పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న తెలంగాణ సర్కారు తాజాగా రూ. 99,999 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల కాగా ఇక రైతుల రుణ ఖాతాల్లో జమ కావడమే మిగిలి ఉంది.
Farmers Loan Waiver: కరోనా సమయంలోనూ రైతుల కోసం తమ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.