Farmers Loans Waiver: రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతు బంధు.. ఇప్పుడు రైతు రుణ మాఫీ

Farmers Loans Waiver: రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు పథకంతో పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న తెలంగాణ సర్కారు తాజాగా రూ. 99,999 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల కాగా ఇక రైతుల రుణ ఖాతాల్లో జమ కావడమే మిగిలి ఉంది.

Written by - Pavan | Last Updated : Aug 15, 2023, 11:20 AM IST
Farmers Loans Waiver: రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతు బంధు.. ఇప్పుడు రైతు రుణ మాఫీ

Farmers Loans Waiver: రైతులకు రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కారు.. తమ సర్కారు మాత్రమే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతోంది అని అంటోంది. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు పథకంతో పాటు రైతుల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోన్న తెలంగాణ సర్కారు తాజాగా రూ. 99,999 లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే నిధులు విడుదల కాగా ఇక రైతుల రుణ ఖాతాల్లో జమ కావడమే మిగిలి ఉంది.

రైతు రాజ్యం..
తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యమని మరోసారి నిరూపితమయ్యింది. దేశంలో ఎక్కడలేని విధంగా సాగునీటి వసతులు కల్పించిన విషయం తెల్సిందే. మిషన్‌   కాకతీయ పేరుతో 35వేల చెరువులను బాగు చేయడంతోపాటు కాళేశ్వరం వంటి బహుళార్థకసాధక ప్రాజెక్టు కట్టి సాగునీటి రంగంలో అద్భుతం సృష్టించింది. రైతులకు సకాలంలో ఎరువులను అందుబాటులోపెట్టడం, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాలు బెడద రైతులకు రాకుండా నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించి వారిని జైళ్లకు పంపడం, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, రైతులకు మార్కెటింగ్‌   సౌకర్యాలు కల్పించడం.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో అద్భుతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌  , తెలంగాణ సర్కారు రైతుల చేపట్టిన విషయం తెల్సిందే. 

2014 నాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి వరకు బ్యాంకులకు రైతులు బకాయిపడ్డ రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌   తీసుకున్న ఈ నిర్ణయంతో 35 లక్షల 32వేల మంది రైతులకు నేరుగా లబ్ది చేకూరింది. ప్రభుత్వం అక్షరాల 16వేల 144 కోట్లను వెచ్చించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండానే ఈ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి రైతులను రుణవిముక్తులను చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన విధంగానే 2018లో అధికారంలోకి వస్తే కూడా రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌   ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రైతు రుణమాఫీ చేస్తున్నారు. నేటి వరకు 16 లక్షల 66వేల 899 మంది రైతులకు సంబంధించి 7753 కోట్ల 43 లక్షల రుణాలను మాఫీ చేసింది.

రైతు బీమా పథకం..
దుఃఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఇప్పటి వరకు మరణించిన రైతులకు సంబంధించి లక్ష 8051 మంది రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. 5,402.55కోట్లను పరిహారంగా అందించింది. రైతు మరణించిన కేవలం 15 రోజుల్లోనే బీమా సొమ్ము రైతులకు అందేలా ఏర్పాట్లు చేసింది. ఇది దేశంలోని మరే రాష్ట్రంలో లేదు.

ఉచిత విద్యుత్ పథకం..
దేశంలో రైతులకు 24 గంటలపాటు ఉచిత నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో 27 లక్షల 49వేల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. ఉచిత విద్యుత్తు అందించేందుకు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 96 వేల288 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి విద్యుత్తు రంగంలో మౌళిక వసతుల కల్పన కోసం అక్షరాల 32వేల 700 కోట్లను ఖర్చు చేసింది. కేవలం తొమ్మిదిన్నరేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్తు రంగంపై ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి లేదు.

ఇది కూడా చదవండి : Minister Harish Rao: ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ నెల 16 నుంచి రూ.లక్ష పంపిణీ

రైతు బంధు పథకం
దేశ రైతాంగ చరిత్రలోనే రైతు బంధు అతి గొప్ప సంస్కరణ.  రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా పథకాన్ని రూపొందించారు. ఎకరానికి సాలీన 10వేల చొప్పున ఇప్పటి  వరకు గడిచిన 11 విడుతలలో  కలిపి 71వేల 552 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ప్రతీ సంవత్సరం రైతు బంధు అందుకునే రైతుల సంఖ్య పెరుగుతున్నది. ఈసారి కొత్తగా పోడుపట్టాలున్నరైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా వర్తింప చేశారు. దీంతో లక్షా 51వేల 469 మంది గిరిజన రైతులకు 4 లక్షల 6వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ. రెండు వందల కోట్లను విడుదల చేసింది. ఇది ఈ సీజన్‌‌కు మాత్రమే. ఏడాదికి రూ.నాలుగు వందల కోట్లను కేవలం పోడు రైతులకు రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నారు.

ఇది కూడా చదవండి : CM KCR Decision on Rythu Runa Mafi 2023: రైతు రుణ మాఫీపై కేసీఆర్ కీలక నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News