Farmers Loan Waiver: తెలంగాణ ట్రెజరీలో సరికొత్త రికార్డు.. మంత్రి హరీశ్ రావు ట్వీట్

Farmers Loan Waiver: కరోనా సమయంలోనూ రైతుల కోసం తమ సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి  సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2023, 11:24 AM IST
Farmers Loan Waiver: తెలంగాణ ట్రెజరీలో సరికొత్త రికార్డు.. మంత్రి హరీశ్ రావు ట్వీట్

Farmers Loan Waiver: రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కి తన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినప్పటికీ .. కరోనా వైరస్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ .. రైతు సంక్షేమం విషయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏనాడూ రాజీ పడలేదు అని సీఎం కేసీఆర్ ని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. 

ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసి అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ సర్కారు రికార్డును నెలకొల్పింది అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. 

బ్యాంకులకు కానీ లేదా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ వెళ్లి దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, ఎక్కడా లైన్‌లో నిలుచునే అవస్థలు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం అసలే లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోంది అని తమ ప్రభుత్వాన్ని మంత్రి హరీశ్ రావు ఆకాశానికెత్తారు.

ఇది కూడా చదవండి : Farmers Loans Waiver: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల రుణ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ

రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి  సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు అదే రీతిలో రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారని.. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Farmers Loans Waiver: రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతు బంధు.. ఇప్పుడు రైతు రుణ మాఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News