Amit Shah Meeting in Khammam: తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తే.. రైతులపై ఈటల వరాలు

Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2023, 05:36 AM IST
Amit Shah Meeting in Khammam: తెలంగాణలో బీజేపి అధికారంలోకి వస్తే.. రైతులపై ఈటల వరాలు

Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు. రైతాంగానికి గతంలో అనేక సబ్సిడీలు వచ్చేవి.. ఇవాళ అవన్నీ ఎత్తేసి.. ఒక్క రైతు బంధు ఇస్తూ.. మిగిలిన సబ్సీడీలు అన్నీ దోచేస్తున్నాడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులకు హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తాం అని బీజేపి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రకటించారు.

ఖమ్మంలో జరిగిన బీజేపి బహిరంగ సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, " ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లకోసం జాగలిస్తం. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే.. కానీ చేతల ప్రభుత్వం కాదు " అని అన్నారు . తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరూ ముక్తకంఠంతో అంటున్నారు.. అన్నా కేసీఆర్ ను పంపించి.. మోదీకి పట్టం గడితేనే మా జీవితాలు బాగుపడతయ్ అంటున్నరు అని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

ఇదే సభలో బండి సంజయ్ మాట్లాడుతూ, " ఉద్యమాల గడ్డ ఖమ్మం ... చైతన్యం, పౌరుషం కలిగిన గడ్డ ఈ ఖమ్మం గడ్డ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర మీ ఖమ్మం ప్రజలది. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్.. పేదలను దుబాయ్ తీసుకపోతానని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కొడుకు పేరును మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నాటకాలు ఆడే మనిషి కేసీఆర్. మోసం చేయడం బాగా తెలిసిన కేసీఆర్ కి ఎన్నికలు వస్తేనే.. పేదోళ్లకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తొస్తాయ్. అందుకే మీరంతా ఆలోచన చేయాలె అని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : Minister Harish Rao: సీఎం పదవి కాదు.. సింగిల్ డిజిట్ తెచ్చుకోండి: అమిత్‌ షాకు హరీశ్ రావు కౌంటర్

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ,  " ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలి.. రామరాజ్యం రావాలి. మోదీ రాజ్యం రావాలి. ఇందుకోసం మీరంతా సహకరించాలి " అని ఖమ్మం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీజేపి అగ్రనేత అమిత్ షా రాకతో బీజేపి శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. అది వారి ప్రసంగాల్లోనూ కనిపించడం గమనార్హం.

ఇది కూడా చదవండి : Amit Shah: కేసీఆర్ నీ కొడుకు సీఎం అయ్యే ప్రసక్తే లేదు.. నిప్పులు చెరిగిన అమిత్‌ షా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News