Farmers Loans Waiver: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల రుణ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ

Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. 

Written by - Pavan | Last Updated : Aug 15, 2023, 11:30 AM IST
Farmers Loans Waiver: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల రుణ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ

Farmers Loans Waiver: తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సర్కారు తీపికబురు అందించింది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో ఆ మేరకు నగదు జమ కానుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఆనాటి హామీ మేరకు ఈ రోజు రూ. 99,999 రూపాయల వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. 

రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇవి రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద బ్యాంకుల ఖాతాల్లో జమ అవుతాయి.     

2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌  11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీపై కసరత్తు చేపట్టి వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక ఏడాది సమయం పట్టింది. అయితే, అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించడం, లాక్‌ డౌన్‌   ఉండడం, మన దేశంలో నోట్ల రద్దు పర్యావసానాలతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఒడిదొడుకులకు గురికావడంతో ప్రభుత్వానికి వనరులు సమకూరడంలో ఇబ్బంది ఏర్పడింది. అయినప్పటికీ ఇప్పటికే 50వేల లోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించింది. ఈ మొత్తాన్ని రైతురుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. 

ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. అందులో భాగంగానే తాజాగా 99,999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీ కోసం 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా అమలు చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బీఆర్‌వో) కూడా ఇచ్చారు. ఈమేరకు ఆగస్టు 3వ తేదీ నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రుణమాఫీకి సంబంధించి..  ఇచ్చిన మాట ప్రకారం, 99,999 రూపాయల వరకు ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తాజాగా ఆదేశాలు ఇచ్చారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు లబ్దిచేకూరినట్లవుతుంది.

ఇది కూడా చదవండి : KTR Speech In Nizamabad: రేవంత్ రెడ్డిపై ప్రాసలతో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్

45 రోజుల కార్యాచరణ..
రైతుల రుణమాఫీ గురించి ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ప్రకటించిన మరుక్షణం నుంచే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావులు సీఎం ఆదేశాలకు అనుగుణంగా 45 రోజుల కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా రోజువారీగా సమీక్షలు చేస్తూ బ్యాంకులతో మాట్లాడుతూ రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 3వ తేదీననాడు 41వేల లోపు రుణాలున్న 62వేల 758 మంది రైతులకు సంబంధించి 237 కోట్ల 85 లక్షల రూపాయలను విడుదల చేశారు. అలాగే, ఆగస్టు 4వ తేదీన 43వేల లోపు రుణాలున్న 31వేల 339 మంది రైతులకు సంబంధించి 126 కోట్ల 50 లక్షల రుణాలను మాఫీ చేస్తూ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. తర్వాత తాజాగా 99,999 రూపాయల వరకు ఉన్న రుణ మొత్తాలను జమ చేస్తున్నది. 99, 999 రూపాయల వరకు అప్పున్న రైతుల సంఖ్య 9 లక్షల 2 వేల 843 ఉన్నది. వీరికి సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనున్నది.  దీంతో 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు రూ.7753 కోట్ల 43 లక్షల రూపాయలను ప్రభుత్వం రైతు రుణ మాఫీ కింద చెల్లించినట్లవుతుంది.

ఇది కూడా చదవండి : Minister Srinivas Goud: కుల వృత్తులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News