OPEC Decision: క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా నాలుగు నెలల్నించి పెరుగుతుండటంతో..ఒపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
Petrol, Diesel Price Today: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా...కేంద్ర ప్రభుత్వం శనివారం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కేంద్రం బాటలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌లో కోతలను ప్రకటించాయి.
Bandi Sanjay: పెట్రోల్ బాదుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చమురుపై పన్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగివచ్చాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే వివిధ రకాల సుంకాల ద్వారా సామాన్య ప్రజల జేబులను చిల్లు చేస్తున్న కేంద్ర సర్కారు మరో పిడుగులాంటి వార్త అందించింది. అది ఈ సారి బైక్ ప్రియుల వంతు అయింది. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో పన్నులు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. 2014 నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు ఆటో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా
కేంద్రం విమాన ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి.. విమానయాన సంస్థలకు కాస్త ఊరటను ఇచ్చింది. జెట్ ఫ్యూయల్(ఏటీఎఫ్) పై విధిస్తున్న సుంకాన్ని 11% తగ్గిస్తున్నట్లు ఈ రోజే కేంద్రం ప్రకటించింది.
వాహనదారులకు శుభవార్త. పెట్రో ధరలు మరింత తగ్గాయి. పెట్రోల్ పై రూ.2.50 వరకు.. డీజిల్ పై 2.41 మేర ధరలు తగ్గాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ముడిచమురుపై సుంఖం తగ్గించడంతో ఈ మేరకు పెట్రో ధరలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో హైద్రాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 72.40, లీటర్ డీజిల్ ధర రూ.61.81గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 68.38, డీజిల్ ధర రూ. 56.89గా ఉంది. ఎన్టీయే సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రో ఉత్పత్తులపై సుంఖం తగ్గించడం ఇదే తొలిసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.