ఇప్పటికే జేబులు చిల్లు.. కేంద్రం మరో పిడుగులాంటి వార్త..

ఇప్పటికే వివిధ రకాల సుంకాల ద్వారా సామాన్య ప్రజల జేబులను చిల్లు చేస్తున్న కేంద్ర సర్కారు మరో పిడుగులాంటి వార్త అందించింది. అది ఈ సారి బైక్ ప్రియుల వంతు అయింది. పెట్రోల్, డీజిల్  రిటైల్ ధరలో పన్నులు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. 2014 నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు ఆటో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా

Last Updated : Mar 14, 2020, 04:03 PM IST
ఇప్పటికే జేబులు చిల్లు.. కేంద్రం మరో పిడుగులాంటి వార్త..

న్యూఢిల్లీ: ఇప్పటికే వివిధ రకాల సుంకాల ద్వారా సామాన్య ప్రజల జేబులను చిల్లు చేస్తున్న కేంద్ర సర్కారు మరో పిడుగులాంటి వార్త అందించింది. అది ఈ సారి బైక్ ప్రియుల వంతు అయింది. పెట్రోల్, డీజిల్  రిటైల్ ధరలో పన్నులు ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. 2014 నుండి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సార్లు ఆటో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వాహనదారులకు బారీ షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు చమురు ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నా తరుణంలో కేంద్ర సర్కారు అనుహ్యంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఒక్కసారిగా అందరినీ ఆశ్చ్యర్యపర్చింది. కాగా లీటర్ పెట్రోల్ పై 3రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Read Also: ఆస్పత్రి నుంచి ఐదుగురు కరోనావైరస్ అనుమానితుల పరారీ

అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గిన ఫలితం వినియోగదారులకు అందకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో బ్యాలెన్స్ చేసింది. ఇప్పటికే  భారత ఆర్థికమందగమనంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2నుంచి 8పెంచగా.. డీజిల్ పై రూ.4కు పెంచింది. అటు పెట్రోల్ పై రూపాయి, డీజిల్ పై రూ.10 వరకు రోడ్ సెస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారుల జేబుకు చిల్లులు పడనున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Also Read: ఇది ఆ హత్యేనా, మరేదైనా ఉందా...

Trending News