Petrol, Diesel Price Today: పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Central government) ప్రకటించిన తర్వాత... మహారాష్ట్ర సర్కారు (Maharashtra government) కూడా రేటును తగ్గించింది. ఈ చర్య ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలోని పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. నివేదికల ప్రకారం, ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను లీటరుకు రూ.2.08 మరియు లీటరుకు రూ.1.44 చొప్పున తగ్గించాలని నిర్ణయించింది. ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ (VAT) విధిస్తాయి. కాబట్టి, ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే.. వ్యాట్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.9.5 మరియు డీజిల్ ధరలు వరుసగా రూ.9.5 తగ్గాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అధిక ఇంధన ధరల ఒత్తిడితో సతమతమవుతున్న సామాన్యులకు ఇది ఊరటనిస్తోంది. దేశంలో అధిక ద్రవ్యోల్బణాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా..మోదీ ప్రభుత్వం ఈ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేరుకుంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి 7.79 శాతానికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు:
దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా... లీటర్ డీజిల్ ధర రూ. 89.62గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రేటు రూ. 111.35, డీజిల్ రేటు రూ. 97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 102.65, డీజిల్ రూ. 94.24గా...కోలకత్తాలో పెట్రోల్ రూ. 106.03, డీజిల్ రూ.92.76గా...బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 101.94, డీజిల్ రూ. 87.89గా ఉంది.
Also Read: SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులరా..బీ అలర్ట్..హెచ్చరికలు జారీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook