Delhi violence case: ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి మోస్ట్ వాంటెడ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీలో అల్లర్లు, ఐబి ఆఫీసర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ హుస్సేన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత తాహిర్ హుస్సేన్ని అరెస్ట్ చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. అతడిని ఆరు గంటలపాటు విచారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం రూస్ ఎవెన్యూ కోర్టు వద్దకు వచ్చిన తాహిర్ హుస్సేన్ని చాకచక్యంగా అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం... అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఇంతకీ తాహిర్ హుస్సేన్ నుంచి పోలీసులు రాబట్టాలనుకుంటున్న సమాచారం ఏంటి ? తాహిర్ నుంచి పోలీసులు
ఢిల్లీ హింసలో ఆందోళనకారులపై, పోలీసులపై 8 రౌండ్ల కాల్పులు జరిపిన కేసులో షారుఖ్‌ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని షామిలిలో అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షారుఖ్‌ని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ఢిల్లీ అల్లర్లకు కారకులెవరు ? ఢిల్లీలో హింసకు పాల్పడిన అల్లరిమూకలు, ముఠాలను ప్రోత్సహించిందెవరు ? దేశం నలుమూలల నుంచి వివిధ సందర్భాల్లో నేతలు చేస్తోన్న విద్వేషపూరిత ప్రసంగాలే అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడేందుకు ఊతమిస్తున్నాయా ? ఒక పార్టీపై మరొక పార్టీ బురదజల్లుకునే క్రమంలో నేతలు ఇస్తోన్న విధ్వేషపూరిత ప్రసంగాలు అల్లరిమూకలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపే ప్రత్యేక కథనమే ఈ వీడియో స్టోరీ.
ఢిల్లీ అల్లర్లు ఇటీవల ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో.. ఎంత ప్రాణనష్టానికి కారణమయ్యాయో తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి మరోసారి అటువంటి సీన్ రిపీట్ చేసేందుకు మరో కుట్ర జరిగింది. దీంతో ఢిల్లీ వాసులు ఒక్కసారిగా వణికిపోయారు. ఏదో జరుగుతోందని పసిగట్టిన పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరికీ ధైర్యం చెప్పి టెన్షన్ తగ్గించారు. ఇంతకీ ఆదివారం రాత్రి ఏం జరిగిందో తెలియాలంటే ఇదిగో ఈ స్టోరీ చూడాల్సిందే.
ఇటీవల జరిగిన హింసాకాండతో తల్లడిల్లిన ఈశాన్య ఢిల్లీలో ఆదివారంనాడు మరో మూడు మృతదేహాలు కనిపించాయని, గోకుల్‌పురి కాలవలో ఒక శవం కనిపించగా, భాగీరథి విహార్ కాలవలో మరో రెండు దొరికాయని ఢిల్లీ పోలీస్ అధికారులు చెప్పారు. దీంతోఆదివారం నాటికి ఢిల్లీ అల్లర్లలో
ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్యకు ఓ లెక్క ఉందేమో కానీ... ఆ అల్లర్లు మిగిల్చిన విషాదానికి గురైన బాధితుల సంఖ్యకు లెక్కలేదు. ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 42 కి చేరినప్పటికీ.. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఎన్ని రోడ్డున పడ్డాయో చెప్పడం ఎవరితరం కాదు.. కొడుకును పోగొట్టుకుని రోదిస్తున్న తల్లిని ఎవరు ఓదార్చగలరు ? జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అర్థాంతరంగా దూరమైతే ఆ మహిళ పడే మానసిక వేధనకు అంతుందా ? తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలకు ఇక దిక్కెవరు ? ఇలాంటి సందేహాలే ఇదిగో ఈ కుటుంబాన్నీ వేధిస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లు మిగిల్చిన ఈ విషాదానికి అంతుందా ?
ఢిల్లీ అల్లర్లు, హింసకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు, కోల్‌కతాలో సీఏఏకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ ఇజ్రత్ జహాన్ అరెస్ట్, సీబీఎస్ఇ పరీక్షల అప్డేట్స్, యూపీలో పడవ ప్రమాదానికి సంబంధించిన తాజా అంశాల సమాహారమే ఈ 2020 న్యూస్ వీడియో
ఢిల్లీలో అల్లర్లు, హింస వెనుక బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉన్నాయని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిందని.. లేదంటే ఈ అల్లర్లకు ప్రధాన కారకులైన తాహీర్ హుస్సేన్, కపిల్ మిశ్రాలపై ఢిల్లీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ నిలదీసింది.
ఢిల్లీ అల్లర్లలో హింసకు బలై ఓ తల్లి కొడుకుని పోగొట్టుకుంది.. కోటి ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కాళ్లపారాణి కూడా ఆరకముందే... పెళ్లయి పది రోజులు కూడా అవకముందే భర్తను పోగొట్టుకుంది.. మరో కోటుంబం తండ్రిని కోల్పోయి రోడ్డున పడింది.. మరొక కుటుంబం తల్లిని కోల్పోయింది. ఈస్ట్ ఢిల్లీలో ఎక్కడ చూసినా ఏవో ఒక కన్నీటిగాథలే కనిపిస్తున్నాయి. కన్నీళ్లను దిగమింగుకుంటూ మార్చురీల బయట శవం కోసం వేచిచూస్తోన్న తల్లులు, తండ్రులు, సోదరులు, అక్కాచెల్లెళ్లే కనిపిస్తున్నారు. వాళ్ల బాధలను ప్రత్యక్షంగా చూసిన ఢిల్లీ వాసులు ఏమంటున్నారని జీ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఢిల్లీ హింసపై వాళ్ల అభిప్రాయం ఏంటో మీరే
ఢిల్లీ అల్లర్లలో హింసకు పాల్పడిన ముఠాకు మాస్టర్ మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఎవరు ? 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని ఢిల్లీకి వచ్చిన తాహీర్ హుస్సేన్ ఉన్నట్టుండి కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు ? 8వ తరగతి వరకే చదువుకుని ఒకప్పుడు కూలీ పని చేసుకున్న తాహీర్ హుస్సేన్ ఢిల్లీలోని కోటీశ్వరుల్లో ఒకడిగా ఎలా ఎదిగాడు ? ఫర్నిచర్ తయారు చేసే తాహీర్ హుస్సేన్‌పై జీహాద్ హెడ్‌క్వార్టర్స్‌ని రూపొందిస్తున్నాడనే ఆరోపణలు ఎందుకొచ్చాయి ? ఈ ఆరోపణలకు ఆధారాలున్నాయా ? తాహీర్ హుస్సేన్ చరిత్ర ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో స్టోరీ చూడాల్సిందే.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఈ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీ అల్లర్లను ఆయన ఇంటెలిజెన్స్ వైఫల్యంగా అభివర్ణించారు.
పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు.. దేశ రాజధాని ఢిల్లీలో 17 మందిని బలిగొన్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పౌరసత్వ సరవణ చట్టం నిరసనకారులు, సమర్థించే వారి మధ్య చెలరేగిన ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల ఘర్షణలో 150 మందికి పైగా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.