46కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

ఇటీవల జరిగిన హింసాకాండతో తల్లడిల్లిన ఈశాన్య ఢిల్లీలో ఆదివారంనాడు మరో మూడు మృతదేహాలు కనిపించాయని, గోకుల్‌పురి కాలవలో ఒక శవం కనిపించగా, భాగీరథి విహార్ కాలవలో మరో రెండు దొరికాయని ఢిల్లీ పోలీస్ అధికారులు చెప్పారు. దీంతోఆదివారం నాటికి ఢిల్లీ అల్లర్లలో

Last Updated : Mar 1, 2020, 11:01 PM IST
46కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన హింసాకాండతో తల్లడిల్లిన ఈశాన్య ఢిల్లీలో ఆదివారంనాడు మరో మూడు మృతదేహాలు కనిపించాయని, గోకుల్‌పురి కాలవలో ఒక శవం కనిపించగా, భాగీరథి విహార్ కాలవలో మరో రెండు దొరికాయని ఢిల్లీ పోలీస్ అధికారులు చెప్పారు. దీంతోఆదివారం నాటికి ఢిల్లీ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 46కు పెరిగింది. అంతకు ముందు గురుతేజ్ బహదూర్ ఆస్పత్రి (జిటిబి)లో 38 మంది, ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రిలో ముగ్గురు మరణించినట్టు ప్రకటించారు.

అందులో ఒకరు పోలీస్ అధికారి కాగా, ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులపాటు పెద్ద ఎత్తున జరిగిన హింసాకాండలో 200 మంది గాయపడ్డారని తెలిపారు. యువకులు కొందరు దుకాణ సముదాయాల్ని ధ్వంసం చేసి, వాహనాల్ని దగ్ధం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారని తెలిపారు. గాయపడిన వారిలో సీనియర్ అధికారులు అమిత్ శర్మ, అనుజ్ కుమార్‌తో సహా 11మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. కాగా, గత మూడు రోజులనుండి ఢిల్లీలో సాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News