సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం..
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఇళ్ల పేరుతో ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా అమయాకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు.
కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) ఇప్పుడు కీలకంగా మారింది. ఒక్కసారి వ్యాధిని జయించినవారి ప్లాస్మాతో మరి కొందరి ప్రాణాల్ని రక్షించవచ్చు. అందుకే ఇప్పుడు ప్లాస్మా దాతల అవసరముంది. దాతల్ని ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆ పోలీసులకు సెలెబ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు.
స్వధాత్రి ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
చాలామంది హీరోలు, హీరోయిన్లకు ఎదురైన సమస్యే ఇప్పుడు కమెడియన్ ఆలీకి కూడా ఎదురైంది. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ట్విటర్లో ఫేక్ అకౌంట్‌ను ఏర్పాటు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆలీ శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
తెలంగాణలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి డబ్బు దోచుకునేందుకు రకరకాల కుయుక్తులు, కొత్త కొత్త ట్రిక్కులతో ముందుకు సాగుతున్నారు. వారి వలలో చిక్కుకున్న అమాయక జనం.. చివరకు మోసం జరిగిందని తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు.
టాలీవుడ్ నటి మాధవీలత వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో, ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిశారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లిన మాధవీలత ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా ఈ ముఠా, 170 మంది వ్యక్తులను, రూ .2.25 కోట్లకు పైగా మోసం చేసింది.ఈ ముఠాకు సంబంధించి ఒక మహిళతో సహా ఆరుగురిని డుండిగల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
''నా భర్తను ఎక్కడైతే ఎన్కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసుల చర్యను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధినేతగా ఉన్న శివ సేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు శనివారం శివసేనకు చెందిన సామ్నా పత్రికలో ఓ సంపాదకీయ కథనం ప్రచురితమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.