Telangana: ‘డబుల్’ ఇళ్ల పేరుతో భారీ మోసం..

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఇళ్ల పేరుతో ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా అమయాకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు.

Last Updated : Jul 28, 2020, 11:20 AM IST
Telangana: ‘డబుల్’ ఇళ్ల పేరుతో భారీ మోసం..

cheating on double bedroom houses:హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఇళ్ల పేరుతో ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మందికి పైగా అమయాకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి చివరకు సైబరాబాద్ పోలీసులకు ( Cyberabad police ) చిక్కాడు. విజన్ వన్ ఛానల్ చైర్మన్ అంటూ ఈ మోసానికి పాల్పడుతున్న గుతుల ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ( V. C. Sajjanar ) తెలిపారు.  ఆయన దగ్గర నుంచి 8 నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు, 8లక్షల నగదు, నకిలీ ఐడీ కార్డులు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. Also read: Telangana: కొత్తగా 1,610 కరోనా కేసులు..

బాధితులు ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు జరిపి అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఇదే వ్యక్తి నకిలీ ఐడీ కార్డులతో ఎస్‌ఐగా చెలామణి అవుతూ విజయవాడలో పట్టుబడినట్లు ఆయన తెలిపారు.  Also read: Anil Baluni: మీరే మా ఇంటికి డిన్నర్‌కు వచ్చేయండి

Trending News