Telangana:సెలెబ్రిటీల హ్యాట్సాఫ్

కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) ఇప్పుడు కీలకంగా మారింది. ఒక్కసారి వ్యాధిని జయించినవారి ప్లాస్మాతో మరి కొందరి ప్రాణాల్ని రక్షించవచ్చు. అందుకే ఇప్పుడు ప్లాస్మా దాతల అవసరముంది. దాతల్ని ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆ పోలీసులకు సెలెబ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు.

Last Updated : Jul 26, 2020, 11:43 AM IST
Telangana:సెలెబ్రిటీల హ్యాట్సాఫ్

కరోనా వైరస్ చికిత్సలో ప్లాస్మా థెరపీ ( Plasma therapy ) ఇప్పుడు కీలకంగా మారింది. ఒక్కసారి వ్యాధిని జయించినవారి ప్లాస్మాతో మరి కొందరి ప్రాణాల్ని రక్షించవచ్చు. అందుకే ఇప్పుడు ప్లాస్మా దాతల అవసరముంది. దాతల్ని ఏకతాటిపై తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆ పోలీసులకు సెలెబ్రిటీలు సెల్యూట్ చేస్తున్నారు.

donateplasma.scsc.in ఈ వెబ్ సైట్ ఇప్పుడు ప్లాస్మా దాతలకు ( Plasma Donors ) ఓ వేదిక. కరోనాను జయించినవారు మరి కొందరి ప్రాణాల్ని కాపాడేందుకు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తూ...దాతలందరినీ ఒక్కతాటిపై తీసుకొచ్చే బృహత్ ప్రయత్నమిది. ఈ ప్రయత్నం చేసింది సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police ) , సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ( SCSC ). కేవలం వెబ్ లింక్ ప్రారంభించడమే కాకుండా సామాజిక మాధ్యమాల  ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న పోలీసులు చేస్తున్న ఈ మరో మహా ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటోంది. అందుకే సెలెబ్రిటీలు ట్వీట్ ద్వారా సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Also read: Telangana: త్వరలో 2 లక్షల యాంటీజెన్ కిట్లతో పరీక్షలు

కరోనా వైరస్ ను జయించినవారు ఇతరుల ప్రాణాల్ని రక్షించాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ( Chiranjivi tweet ) ద్వారా స్పందించారు.సైబరాబాద్ పోలీసులు, ఎస్ సి ఎస్ సి సంయుక్త కృషిని కొనియాడుతున్నారు. ఇదొక అద్బుత ప్రయత్నమని హీరో సాయికుమార్ ట్వీట్ చేయగా...ప్లాస్మా దాతల్ని సత్కరించడం ఇతరులకు స్ఫూర్తిని కల్గిస్తుందని..కరోనాను జయించినవారు ఒక వారియర్ గా వ్యవహరించాలని హీరో మహేశ్ బాబు ట్వీట్ ( Mahesh Babu tweet ) చేశారు. Also read: TS POLYCET: తెలంగాణ పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు

Trending News