NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు

సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు.

Last Updated : Oct 9, 2020, 09:05 AM IST
NTR: అలాంటివారితో ఆన్‌లైన్ పరిచయాలొద్దు

Hyderabad city police created a video with NTR: సమాజంలో జరుగుతున్న నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ నగర పోలీసులు (Hyderabad city police) ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిదే. ఓవైపు నేరాలతో పాటు సామాజిక చైతన్యం కలిగించేలా వీడియోలను రూపొందించి అవగాహన కలిగించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు (Telangana Police) ఎప్పుడూ ముందే ఉంటారు. అంతేకాకుండా కరోనా (Coronavirus) విపత్కర పరిస్థితుల్లో.. ఈ మహమ్మారి సోకి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలతో సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police ) కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నగరంలో అపూర్వ స్పందన సైతం లభించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు తాజాగా సైబర్ మోసాలపై ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) తో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియలో ఓ యువతికి ఫెస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాన్ని చూపించడంతోపాటు ఎన్టీఆర్ (N. T. Rama Rao Jr.) సందేశాన్ని జోడించారు హైదరాబాద్ పోలీసులు.  Also read: KGF 2 Yash: కెమెరా ముందుకు.. రాఖీ భాయ్

ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణమవుతాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్టీఆర్ సూచించారు. అయితే సైబర్ మోసాలపై అవగాహన కలిగిస్తున్న హైదరాబాద్ నగర పోలీసులపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Also read: Nani: సినిమా సెట్‌లో ‘టక్ జగదీష్’

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News